చిత్తూరు లో భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన బాధితులను ఆదుకోవాలని సదుద్దేశంతో లయన్స్ క్లబ్ ఆ చిత్తూర్ గోల్డ్, లయన్స్ క్లబ్ బ్లూస్, లయన్స్ క్లబ్ ఆ చిత్తూర్ 3 క్లబ్బుల ఆధ్వర్యంలో ఆహారం పంపిణీచేశారు.
బెంగుళూరులోని లయన్స్ క్లబ్ నైటింగేల్ వారి సౌజన్యంతో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈరోజు ఉదయం దోబీ కాలనీ, వీరభద్ర కాలనీ, తెనబండ మరియు మురాద్బాబా దర్గా ప్రాంతం మారుతూ షుగర్ ఫ్యాక్టరీ బ్రిడ్జి కింద ఉన్న రిక్షా కాలనీ వారికి సుమారు 750 ఇండ్లకు ఆహార పదార్థాలు, లు0గీలు చీరలు, దుప్పట్లు , నైటీలు పంపిణీ చేయడం జరిగింది.
ఈకార్యక్రమంలో లయన్స్ క్లబ్స్ గవర్నర్ లయన్. భక్తవస్థల రెడ్డి గారు, నరేష్, మోహన్ రెడ్డి, మధు, సుదర్శన్, డాక్టర్ విజయ్ కుమార్, సురేష్ బాబు, భాస్కర్, శ్రీనివాసమూర్తి, ఎర్రయ్య, బాలాజీ, రాజా, జగదీష్ తదితరులు పాల్గొన్నారు, మరియు అన్ని క్లబ్బుల లయన్స్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
.