ఏకాత్మతా మానవాతావాద సిద్ధాంత కర్త, అంత్యోదయ స్ఫూర్తి ప్రధాత పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి వర్ధంతి సందర్భంగా బిజెపి తిరుపతి పార్లమెంటు జిల్లా ఉపాధ్యక్షులు డా. చంద్రప్ప నేడు శ్రీకాళహస్తి పట్టణంలోని వారి స్వగృహం నందు దీన్ దయాళ్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా చంద్రప్ప మాట్లాడుతూ చిన్నతనం నుండి చివరి వరకూ తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న మహనీయుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ అన్నారు.
ప్రభుత్వం యొక్క ఫలాలు సమాజంలోని చిట్టచివరి వ్యక్తి వరకూ చేరాలని పరితపించిన వ్యక్తి దీన్ దయాళ్ అన్నారు. అధికారం ఏ ఒక్కరి చేతుల్లో బందీ కాకూడదని, జిల్లా స్థాయిలో, పంచాయతీల స్థాయిలో కొన్ని అధికారాలు ఉండాలని అధికార వికేంద్రీకరణను కోరుకున్న వ్యక్తి దీన్ దయాళ్ అని చెప్పారు.
ఇలా అధికారం వికేంద్రీకరణ జరిగినా, దేశం దగ్గరికి వచ్చేసరికి ప్రతి ఒక్కరూ సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. అలాంటి ఉన్నతమైన వారి సిద్ధాంతాలను భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతాలుగా మలచుకొని ముందుకు సాగుతోందని అన్నారు.
అందుకే నరేంద్రమోదీ గారి ప్రభుత్వం కూడా అంత్యోదయ స్ఫూర్తితో ప్రభుత్వం యొక్క అభివృద్ధి ఫలాలను నేరుగా ప్రజలకే చేరవేస్తోందని అన్నారు. దీన్ దయాళ్ గారి కళలను బిజెపి సాకారం చేస్తుందని, ఆ దిశగా ముందుకు సాగుతోందని వారు స్పష్టం చేశారు.
Discussion about this post