శ్రీకాళహస్తీశ్వర ఆలయ శివయ్య గోపురం వద్ద ఆక్రమణలను గురువారం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు ఆధ్వర్యంలో తొలగించారు.
శివయ్య గోపురం వద్ద ఇరువైపులా వివిధ పూజా సామగ్రిని విక్రయించడానికి వ్యాపారులకు దేవస్థానం అనుమతించింది. అయితే దుకాణదారులు తమకు కేటాయించిన స్థలం కన్నా ముందుకు వచ్చి దుకాణాలు ఏర్పాటు చేసుకుని భక్తుల రాకపోకలకు ఇబ్బంది పెట్టడం.. భక్తులను దోచుకునే విధంగా పూజా సామాగ్రి విక్రయించడం చేస్తున్నారు.
ఈ అక్రమాలపై ఫిర్యాదు రావడంతో ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఆ ప్రాంతంలో పర్యటించి దుకాణాల ఆక్రమణల తొలగించారు. కేటాయించిన స్థలం వరకే దుకాణాలు పెట్టుకుని వ్యాపారాలు చేసుకోవాలని లేకుంటే పూర్తిగా దుకాణాలు తొలగించాల్సి వస్తుందని హెచ్చరించారు.
వివిధ పూజల పేరిట అవసరం లేని వాటిని భక్తులు కు విక్రయాలు చేయవద్దని.. బతుకు కోసం చేసే వ్యాపారం ఎదుటివారి కడుపు కొట్టే విధంగా ఉండరాదుని వ్యాపారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు సాధన మున్నా రాయల్, జయశ్యాం, ఆలయ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది, హోంగార్డులు పాల్గొన్నారు.
.