శ్రీకాళహస్తీశ్వర ఆలయ మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పించాలని… దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు వీఐపీలకు స్వామిఅమ్మవార్ల దర్శనం కోసం ఒక నిర్ణీత సమయం కేటాయించాలని జిల్లా కలెక్టర్ ఎం.హరినాయణన్ అన్నారు.
శుక్రవారం ఉదయం శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయ ఈఓ పెద్దిరాజు,ఏ ఈఓ కృష్ణారెడ్డి లు కలెక్టర్ ను కలసి మహాశివరాత్రి ఏర్పాట్లు గురించి వివరించి.. ఆహ్వానం పలికారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సూచిస్తూ సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారి దర్శనాలకు అధిక ప్రాధాన్యతఇవ్వాలని అందుకు తగిన విధంగా పోలీసుల సహకారం, పరిశుభ్రత పై ఏర్పాట్లుచేయాలని అన్నారు.
విఐపి లకు ప్రత్యేక సమయం కేటాయింపు చేయాలని, సాధారణ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్వరగా దర్శన భాగ్యం కల్పించేలా ప్రాధాన్యత చూడాలని అన్నారు.
ఆహారం, నీటి సరఫరా, క్యూ లైన్ల నిర్వహణ విషయంలో ఎటువంటి లోపాలు లేకుండా కోవిడ్ నిబంధనలను పాటించాలన్నారు
.