తలరాత స్క్రిప్టు మారింది

244

తర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నిజమే. కానీ తొలిసారిగా స్క్రిప్టు మారిపోయింది.

మారిపోయింది ఏదో ఆషామాషీ స్క్రిప్టు కాదు.. షూటింగులో ఎలా తగలడినా డబ్బింగ్ లో ఎడ్జస్టు చేసుకోవచ్చుననుకునే స్క్రిప్టు కాదు.. ఏకంగా తలరాత స్క్రిప్టే మారిపోయింది. జగన్ పార్టీని భుజాన మోసినందుకు.. వారు అధికారంలోకి రాగానే.. ఉన్నపళంగా స్థాయికి మించిన పదవి వచ్చి వరించింది. కానీ చేతలు మాత్రం.. పాత రేంజిలోనే ఉండిపోయాయి. ఫలితం.. పరువు బజార్న పడింది. పదవికి గండం వచ్చింది.

తిరుమల తిరుపతి దేవస్థానాల వారి ఎస్వీబీసీ భక్తి చానెల్  కు ఛైర్మన్ గా నియమితుడైన సినీ నటుడు పృథ్వీరాజ్.. మహిళా ఉద్యోగినితో అనుచితమైన సంభాషణ చేసినందుకు పదవిని కోల్పోవాల్సి వచ్చింది.

 

Facebook Comments