తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి దగ్గర గల అమర హాస్పిటల్లో చాలా అరుదైన హ్యాండ్ & మైక్రో శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. 9 నెలల వయస్సు కలిగిన పసికందుకు పూర్తిగా తెగి వేరుపడిన వేలిని తిరిగి అతికించి విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు.
పీలేరు చెందిన బాబు రెండు సంవత్సరాలు వయస్సు కలిగిన వాళ్లు సోదరుడుతో కలిసి ఆడుకుంటుండగా టైలరింగ్ హెవీకత్తెర తెగి 9 నెలల బాబు బొటన వేలు పూర్తిగా తెగి ముక్కలుగా విడిపోయింది. వారి యొక్క తల్లిదండ్రులు చూసి బొటనవేలు యొక్క సగ భాగమును మరియు బాబును సంఘటన జరిగిన 5 గంటల తర్వాత వాళ్లు మన అమర హాస్పిటల్ ఆర్థోపెడిక్ విభాగంలో సంప్రదించారు.
అమర హాస్పిటల్ లోని ప్రముఖ హ్యాండ్ & మైక్రో వైద్య నిపుణులు డాక్టర్ వాసుదేవ రెడ్డి మెట్రో సిటీల్లో సైతం పదుల సంఖ్యలో కూడా చేయని అరుదైన సర్జరీని 5 గంటల సమయం పాటు శ్రమించి విజయవంతంగా పూర్తిచేశారు. ఇ౦త చిన్న వయస్సు కలిగిన బాబుకు రీ ప్లాంటేషన్ సర్జరీలు మన ఇండియాలోనే కేవలం పదుల సంఖ్యలో జరిగి ఉన్నాయని డాక్టర్ వాసుదేవ రెడ్డి అన్నారు.
ఇలాంటి చాలా అరుదైన సర్జరీని సరైన సమయంలో తమ బాబుకు శస్త్రచికిత్స నిర్వహించినందుకు బాబు తల్లిదండ్రులు అమర హాస్పిటల్ డాక్టర్ ఎ౦డి గౌరినేని రమాదేవికి, డాక్టర్ల బృ౦దానికి, హాస్పిటల్ సిబ్బందికి ఎంతో రుణపడి ఉంటామని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సీఈవో వేణుగోపాల్, మెడికల్ సూపర్డెంట్ సుదర్శన్ నంద, మునినాధం, నరసింహ రావు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.
.