శ్రీ శుక బ్రహ్మాశ్రమం వారి సౌజన్యంతో, శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాముల వారి దివ్య ఆశీస్సులతో భగవద్గీత తరగతులు ప్రారంభించారు.
విద్యార్థినీ విద్యార్థులకు మరియు భగవద్గీత పై ఆసక్తి కలిగిన వారికి ఉచితముగా నేర్పనున్నట్లు నిర్వాహకులు చెప్పారు.
కావున ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు జరుగు ఈ కార్యక్రమానికి ఎవరైనా రావచ్చునన్నారు.
నెహ్రు వీధి, ధనలక్ష్మి మెడికల్ షాపు ప్రక్కన, గంజి ముని కృష్ణయ్య నిలయంలో ఈ తరగతులు జరుగుతాయి.
శ్రీ శుక బ్రహ్మాశ్రమం యోగాచార్యులు మార్కండేయ క్లాసులు నిర్వహిస్తారు. ఈ క్లాసులకు వచ్చేవారు నోట్ బుక్, పెన్ తీసుకు రావాలి. ఇతర వివరములకు 9849507916 నెంబర్ లో సంప్రదించవచ్చు.
Discussion about this post