గరుడపంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమలలో శ్రీమలయప్పస్వామివారు తమ ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. మంగళవారం రాత్రి గరుడ వాహనసేవ జరిగింది.
గరుడ వాహనసేవలో సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ రమేష్ బాబు, విజివో శ్రీ బాలిరెడ్డి, పారు ఫతేదార్ శ్రీ ఉమామహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
.