• About Us
  • Contact Us
  • Our Team
Sunday, August 16, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

Good Morning : సోషల్ హీరోలు.. హీరోలేనా?

admin by admin
October 24, 2021
0
Good Morning : సోషల్ హీరోలు.. హీరోలేనా?

‘‘ఒక పిల్లి ఎలుకను పట్టుకోడానికి కలుగు వద్ద పొంచి ఉంటుంది. ఎలుక బయటకు రాబోయి.. ఆ పిల్లిని చూసి లోపలకు వెళ్లిపోతుంది. పిల్లి మాత్రం పంజా పైకెత్తి.. ఎలుక బయటకు వస్తుందని ఎదురుచూస్తూ ఉంటుంది.’’ ..ఇంతే కథ! అయిపోయింది. ఇదేం పిచ్చి కథ అనుకుంటున్నారా? అయితే ఇదే విషయాన్ని ఎవడైనా మొబైల్ లో వీడియోతీసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తే గనుక.. కొన్ని మిలియన్ల వ్యూస్ వస్తాయి.

ఇవాళ ప్రపంచం ఎలా తయారైందంటే.. ‘పాపులారిటీ’ అంటే ఆ మాటకు అర్థం.. ‘ఎన్ని మిలియన్ వ్యూస్’ అనే అన్నట్టుగా మారిపోయింది. ప్రధానంగా సోషల్ మీడియా ప్రస్తుతం విశ్వరూపం దాల్చి ఉన్న తరుణంలో.. ఏ చిల్లర పని చేసి అయినా.. నిన్నటిదాకా ఎర్రని ఏగానీకి కొరగాని వాడు.. తెల్లారేలోగా.. హఠాత్తుగా సెలబ్రిటీ అయిపోతున్నాడు.

సెలబ్రిటీ అనే పదానికి నిర్వచనం కూడా మారుతోంది. ఒక రంగంలో అపారమైన కృషి చేసి విజయాలు సాధించి.. తన ముద్రను విడిచిపెట్టిన వారు ఒకప్పట్లో సెలబ్రిటీలుగా ఉండేవాళ్లు. ఇప్పుడు అలా కాదు. ఏమీ చేయక్కర్లేదు. జస్ట్ ఒక వెర్రి మొర్రి వీడియో చేసి, ఒక తలతిక్క మాటలను అనేయడం ద్వారా హఠాత్తుగా మిలియన్ల వ్యూస్ ఉన్న సెలబ్రిటీ అయిపోవచ్చు. వారి ఆ సెలబ్రిటీ హోదాను కాపాడడానికి వారి ఇంటర్వ్యూలతో నెటిజన్లను ముంచెత్తడానికి ఇంకా కొన్ని వందల యూట్యూబ్ చానెళ్లు కూడా రెడీగా ఉంటాయి. ట్విటర్, ఇన్ స్టా తతిమ్మా సోషల్ వేదికలు సరే సరి!

సోషల్ మీడియా.. సామాన్యుడి చేతికి అందివచ్చిన అద్భుతమైన అస్త్రం. కానీ.. ఆ వేలం వెర్రిలో ఎవరు ఎలాంటి పోకడలు పోతున్నారు. సోషల్ మీడియా పుణ్యమాని హీరోలుగా, హీరోయిన్లుగా చెలామణీ అవుతున్న వాళ్లంతా.. నిజంగా హీరోలేనా? వారి హీరోయిజానికి కొలబద్ధ ఏమిటి? అనే ప్రశ్న వేసుకున్నప్పుడు సమాధానం దొరకదు. తలతిక్క పనులే వారి పాపులారిటీకి, హీరోయిజానికి నిదర్శనాలుగా అనేక సందర్భాల్లో తేలుతుంటాయి.

ఇదే విషయాన్ని ఓ సుభాషితం కూడా మనకు చాలా సరళంగా చెబుతుంది.

ఘటం భింధ్యాత్ పటం ఛింధ్యాత్ కుర్యాత్ గార్దభ ఆరోహణమ్
యేన కేన ప్రకారేణ ప్రసిద్ధః పురుషో భవేత్

కుండను పగలగొట్టడం ద్వారా.. బట్టలను చించుకోవడం ద్వారా.. గాడిదను ఎక్కి ఊరేగడం ద్వారా ఏదో ఒక తీరుగా.. ఏ పని చేసైనా సరే.. ప్రసిద్ధులు అయిపోవాలని ఆరాటపడేవారు అనేకులు ఉంటారు. …అనేది శ్లోకభావం.

‘పాపులర్ అయితే చాలు.. ఏ ఘనకార్యం చేసి పాపులర్ అయ్యాం అనేది అనవసరం’ అనే తరహా ఆలోచన సరళి అనేకమందికి ఉంటుంది. సుభాషితకారుడు చెప్పినట్టుగా కుండను పగలగొట్టి హీరోలు అయిపోదాం అనుకునే వారు మన చుట్టూ చాలా మంది ఉంటారు. నిత్యం అలాంటి పనికిమాలిన పనుల్లోనే నిమగ్నమై ఉంటారు. వాళ్లకింకేమీ పని ఉండదు. కానీ బోల్డంత పాపులారిటీ సంపాదిస్తుంటారు.

పాపులారిటీ సంపాదించడం అనేది ప్రధానంగా మనం భావిస్తున్నాం సరే.. కానీ.. మనం ఏ పని చేస్తున్నాం.. దానివల్ల ఎవరికి ఏ ఉపయోగం కలుగుతోంది. సమాజహితం ఏమిటి? సాంఘిక ప్రయోజనం ఏమిటి అనేవి దృష్టిలో పెట్టుకోకుండా చేయడం వల్ల ఫలితం లేదు.

EXCLUSIVE ARTICLES
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి

ఈ సుభాషితం ఏ కాలంలో రాయబడిందో గానీ.. ఇవాళ్టి మన సోషల్ మీడియా హీరోలకు అచ్చు గుద్దినట్టుగా సరిపోతుంది. సోషల్ మీడియా అనేది.. ప్రతి ఒక్కరి అరచేతిలోనూ ఇమిడిపోయిన ప్రపంచం మొత్తాన్నీ గుప్పిట పట్టిన వేదికగా మారిపోయిన తర్వాత.. ఇక మంచిచెడులకు హద్దులు చెరిగిపోయాయి. విచక్షణకు స్థానం లేకుండా పోయింది. విలక్షణతకు మాత్రమే ఇక్కడ చోటు! అందరికీ అదొక్కటే ఆరాటం. విలక్షణంగా కనిపించాలి.

అందరూ చేసే పని కాకుండా, చిత్రమైన పని చేస్తే మనం పాపులర్ అయిపోతాం అనే ధోరణి యువతరంలో ప్రబలింది. ఇది మారాలి. చేసే పని సంఘహితం కాకపోయినా స్వహితానికి అయినా బాట వేయాలి. అంతే తప్ప.. ఇలాంటి వెర్రిమొర్రి పనులతో కాలయాపన చేస్తూ.. యువతరం గాడితప్పిపోవడం మంచి పరిణామం కాదు.

శుభోదయం.

Tags: BhartrihariBhartrihari subhashithamgood morninggood morning thoughtquotes on agriculturequotes on good thoughtssubhashitamsubhashithamwhat to sowwhat you sow is what you reapభర్తృహరి సుభాషితంమంచిమాటశుభోదయంసుభాషితం
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

26.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన సామాజిక సంక్షోభాల సజీవ చిత్రణ

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

సురేష్ పిళ్లె: చదువులు వెలుగుతున్నాయా? తగలబడుతున్నాయా?

12.7.26 ‘కథానిధి’ సమీక్ష: సమకాలీన జీవిత వైరుధ్యాలు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply