• About Us
  • Contact Us
  • Our Team
Sunday, August 16, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

Good Morning : నాతో మంచిగా ఉంటే చాలు..

admin by admin
October 14, 2021
0
Good Morning : నాతో మంచిగా ఉంటే చాలు..

పరిపూర్ణమైన వ్యక్తులు ఎవ్వరూ ఉండరు. పరిపూర్ణమైన, మచ్చలేని మంచితనం, వ్యక్తిత్వం ఎవ్వరిలోనూ ఉండదు. అలా ఉంటే అది దైవత్వం అవుతుంది.  కానీ మిత్రబంధువులతో బాంధవ్యాలను కొనసాగించడంలో మనం ఎంచుకునే ప్రమాణాలు భిన్నంగా, చిత్రంగా మారుతుంటాయి.

పరిపూర్ణమైన వ్యక్తులు ఎవ్వరూ ఉండరని మనం ముందే అనుకున్నాం. కానీ వ్యక్తిత్వంలో- ఏది లోపం, ఏది సబబు? ఏది మంచి? ఏది చెడు? దీనిని ఇదమిత్థంగా నిర్ణయించేది ఎవరు?

మంచి చెడులు ఎప్పుడూ కూడా మన దృక్పథాలు! మన బుద్ధిని బట్టి ఎదుటివాళ్లు మంచిగాను చెడుగాను కనిపిస్తుంటారు. అయితే ప్రపంచంలో అందరూ మంచివాళ్లే అయినప్పటికీ.. సార్వజనీనంగా ఎక్కువమంది చెడుగా పరిగణించే అలవాట్లున్న వారిని చెడ్డవారిగా మనం చూస్తుంటాం.

మంచి చెడులు అందరితోనూ మనం సమానంగా మెలగాల్సిందే. అయితే మన బుద్ధులకు సమీపంగా ఉంటూ.. మనకు దగ్గరగా అనిపించే వ్యక్తులనే ‘ఆప్తబృందం’లోకి పరిగణిస్తాం.

వ్యక్తులతో అనుబంధాలు కొనసాగించే విషయంలో మనకు అనేక మార్లు రాజీపడుతూనే ఉంటాం. కొందరు చెడ్డవాళ్ల విషయంలో ఈ రాజీపడడం ఎలా ఉంటుందంటే.. ‘వాడు ఎవరితో ఎంత చెడుగా ఉంటే నాకేంటి? నాతో మంచిగా ఉంటాడు. నాతో మంచిగా ఉన్నంత వరకు నేను అతనిలోని చెడుగురించి ఆలోచించను.. బంధాన్ని కొనసాగిస్తాను’ అనే తరహాలో ఉంటుంది. అందరినీ మోసం చేసిన ఒక వ్యక్తి, అలాంటి మోసాలు చేశాడని మనకు ఖచ్చితంగా తెలిసినప్పటికీ.. నన్ను మోసం చేయలేదు గనుక.. స్నేహంగానే ఉండడం కొందరి అలవాటు.

సార్వజనీనమైన ప్రమాణాల ప్రకారం అందరూ ఖచ్చితంగా చెడ్డవాడే అయిన వ్యక్తితో కూడా మనతో బాగుంటాడు గనుక.. మనకు మంచి మిత్రుడే అనుకునే రాజీతత్వం చాలా మందిలో ఉంటుంది. కానీ.. ఇది ప్రమాదకరం.

ఒక వ్యక్తి ఖచ్చితంగా చెడ్డవాడే అయితే.. నీతో మంచిగా మెలగడం అనేది కేవలం ఒక వ్యూహం, స్వార్థం అని తెలుసుకోవాలి. నీతో ఉన్న ఇతర అవసరం ద్వారా కలిగే ప్రయోజనం, అతని చెడ్డతనం ద్వారా కలిగే ప్రయోజనం కంటె పెద్దదైఉంటుంది. లేదా, అతడు తన చెడ్డతనాన్ని ప్రదర్శించడానికి తగిన అవకాశం ఇంకా వచ్చి ఉండదు. ఈలోగా.. అతడు నాతో మంచిగా ఉంటాడు గనుక.. నాతో మంచిగా మాట్లాడుతుంటాడు గనుక.. నా దృష్టిలో మంచివాడే.. నేను అతనితో గొప్ప అనుబంధాన్నే కలిగిఉంటా.. అంటూ చెలరేగితే.. ఎఫ్పుడో ఒకసారి చేదు అనుభవం తప్పదు.

ఇదే విషయాన్ని ఓ సుభాషితం మనకు చక్కగా వివరిస్తుంది.

దుర్జనః ప్రియవాదీతి నైతద్ విశ్వాసకారణమ్
మధు తిష్ఠంతి జిహ్వాగ్రే హృదయే తు హలాహలమ్

తియ్యగా నీతో మాట్లాడడం అనేది.. వ్యక్తుల్ని విశ్వాసంలోకి తీసుకోవడానికి ఒక కారణం ఎప్పటికీ కాకూడదు. అతని నాలుక చివర్న తేనె పూయబడి ఉంటుంది. కానీ అతని మనసులో మాత్రం విషం ఉంటుంది. .. అనేది శ్లోక భావం.

అచ్చంగా మనతో మంచిగా ఉన్నాడనేది ఎప్పటికీ బంధానికి ప్రాతిపదిక కాకూడదు. వ్యక్తిని విశ్వాసంలోకి తీసుకోవడానికి ప్రమాణం కాకూడదు. ఈ జాగ్రత్త మనలో ఉంటే.. ఎప్పటికీ ఎలాంటి అసంతృప్తులూ కలగకుండా ఉంటాయి. ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి.

శుభోదయం

Tags: BhartrihariBhartrihari subhashithamgood morninggood morning thoughtquotes on agriculturequotes on good thoughtssubhashitamsubhashithamtrust no onetrusting peoplewhat to sowwhat you sow is what you reapఎవరినీ నమ్మవద్దుభర్తృహరి సుభాషితంమంచిమాటశుభోదయంసుభాషితం
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

26.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన సామాజిక సంక్షోభాల సజీవ చిత్రణ

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

సురేష్ పిళ్లె: చదువులు వెలుగుతున్నాయా? తగలబడుతున్నాయా?

12.7.26 ‘కథానిధి’ సమీక్ష: సమకాలీన జీవిత వైరుధ్యాలు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply