• About Us
  • Contact Us
  • Our Team
Friday, August 14, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

Good Morning : ప్రతి మనిషికీ ముగ్గురు భార్యలు!

admin by admin
October 21, 2021
0
Good Morning : ప్రతి మనిషికీ ముగ్గురు భార్యలు!

‘భరించే వాడు భర్త, భరించబడేది భార్య’ ఇలాంటి పాచిపోయిన నిర్వచనాలు అన్నీ మరిచిపోండి. దాంపత్యధర్మం ఆచరణలో నిరూపించే ప్రకారం భార్య అంటే ఒక వ్యక్తిని ఎప్పటికీ విడిచిపెట్టకుండా వెంట ఉండేది. జీవితం మొత్తం అతనితో కలిసి నడిచేది.

ఈ అభిప్రాయం జన సామాన్యంలో స్థిరపడిపోయింది. అందుకే.. ఎవరైనా చాలా సన్నిహితంగా మెలగుతూ ఉండే మిత్రుడు ఉన్నా సరే.. ‘ఏంట్రా.. వాడి భార్యలా అంటిపెట్టుకుని తిరుగుతున్నావ్..’ అంటూ ఆటపట్టించడం కూడా కద్దు. సర్వకాల సర్వావస్థల్లో మనిషిని అంటిపెట్టుకుని ఉంటే గుణాలను కూడా భార్యలుగా అభివర్ణించేట్లయితే గనుక.. ప్రపంచంలో ఏ మనిషికి అయినా.. విధిగా ఉండే గుణాలు ఏవి?

ఈ విషయాన్ని ఓ సుభాషితం చాలా సరళంగా, స్పష్టంగా సరదాగా వివరిస్తుంది..

క్షుధ్ తృట్ ఆశాః కుటుంబిన్య మయి జీవతి న అన్యగాః
తాసామ్ ఆశా మహాసాధ్వీ కదాచిత్ మాం న ముఞ్చతి

ఆకలి, దాహం, కోరిక/ఆశ ఈ మూడు కూడా ప్రతి మనిషికీ ఉండే ముగ్గురు భార్యల వంటివి. మనిషి జీవించి ఉన్నంత వరకు ఈ మూడూ కూడా అతడిని విడచి మరోచోటకు వెళ్లవు. ఈ మూడింటినీ గనుక పోల్చిచూసినట్లయితే.. ఆశ అనేది మహాసాధ్వి. ఎందుకంటే అది ఎప్పటికీ మనిషిని విడిచివెళ్లనే వెళ్లదు. ఆకలి, దాహం అలా కాదు. ఏదైనా తిన్న, తాగిన తర్వాత.. అవి కొద్దిసేపు దూరమౌతాయి. ఆశ అనేది ఎప్పటికీ కూడా మనిషి బుర్రనుంచి పక్కకు తొలగనే తొలగదు.. .. అనేది శ్లోకభావం

పుట్టిన ప్రతి మనిషికీ ముగ్గురు భార్యలు ఉండి తీరుతారంటాడు ఈ సుభాషిత కారుడు. పెళ్లి అనే తంతు అయినా కాకపోయినా.. విధిగా ఉండగల భార్యల సంఖ్య ఇది. పెళ్లితో వచ్చే భార్య అదనం. ఆకలి, దప్పిక, ఆశ అనేవి ముగ్గురు భార్యలని తెలుసుకున్న తర్వాత.. అసలు నిస్సంగంగా ఉండడం అంటే ఏమిటో, సన్యాసం అంటే ఏమిటో తెలుసుకోవాలి మనం.

సన్యాసం అంటే ఏమిటి? వదిలించుకుని వెళ్లిపోవడం. నిస్సంగంగా ఉండడం. కానీ.. మనకు వర్తమాన ప్రపంచంలో కనిపించే బాబాలు, సన్యాసులు, కొత్తరకం దేవుళ్లు  వీళ్లందరూ ఏం విడిచిపెట్టారు.

సన్యాసి అంటేనే విడిచిపెట్టడం అర్థం అంటారు. కానీ జనసామాన్యంలో మనం భావించే అర్థం.. భార్యను విడిచిపెట్టిన వాడు అని! ఒక రకంగా అది అసలు నిర్వచనానికి దగ్గరగానే ఉండవచ్చు. వర్తమాన ప్రాపంచిక జీవితంలో మనం అర్థం చేసుకోవలసినది ఏంటంటే.. సన్యాసం అంటే వదిలిపెట్టడమే కావొచ్చు. కానీ.. వదిలిపెట్టవలసినది.. జీవితంలో మధ్యలో ప్రవేశించే భార్యను కాదు. అలా అనుకుని సన్యసించినట్లుగా మురిసిపోవడానికి వీల్లేదు. పుట్టుక నుంచి చావు వరకు వెంట ఉండే భార్యలను విడిచిపెట్టాలి. ఆకలి దప్పులు నిజానికి చిన్నవి. ఇవి అప్పుడప్పుడూ మనల్ని అంటుకుని ఉండి.. అంతలోనే మాయమైపోతూ ఉంటాయి.

కానీ. సుభాషిత కారుడు చెప్పినట్లుగా.. ఆశ అనేది.. ఎప్పటికీ మనల్ని విడిచిపెట్టని భార్య. దానిని వదిలించుకోవడం ముఖ్యం. దానిని వదిలించుకోగలిగితే.. అసలైన సన్మార్గం కూడా అవుతుంది.

Tags: BhartrihariBhartrihari subhashithamgood morninggood morning thoughtquotes on agriculturequotes on good thoughtssanyasamsubhashitamsubhashithamwhat to sowwhat you sow is what you reapభర్తృహరి సుభాషితంమంచిమాటశుభోదయంసన్యసించడంసన్యాసంసుభాషితం
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

26.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన సామాజిక సంక్షోభాల సజీవ చిత్రణ

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

సురేష్ పిళ్లె: చదువులు వెలుగుతున్నాయా? తగలబడుతున్నాయా?

12.7.26 ‘కథానిధి’ సమీక్ష: సమకాలీన జీవిత వైరుధ్యాలు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply