• About Us
  • Contact Us
  • Our Team
Wednesday, July 29, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

Good Morning : ప్రకృతి నేర్పే అవకాశవాదం!

admin by admin
October 10, 2021
0
Good Morning : ప్రకృతి నేర్పే అవకాశవాదం!

దేవుళ్లు ఖచ్చితంగా మన సంస్కృతి సంప్రదాయాల్లోకి ఎప్పుడు ప్రవేశించారో ఇదమిత్థంగా తేల్చిచెప్పలేం గానీ.. మొట్టమొదటిదైన రుగ్వేదాన్ని గమనించినప్పుడు.. చాలావరకు అందులో ప్రకృతిని ఆరాధించడం మాత్రమే మనకు కనిపిస్తుంది. ప్రకృతిలోని అంశాల్ని, అగ్నిని దేవుడిగా పూజించడమే ఎక్కువగా కనిపిస్తుంది.

ప్రకృతిని చూసే మనిషి తనను తాను తీర్చిదిద్దుకుని ఉంటాడు. కులం, మతం అంటూ ఎలాంటి పేర్లు పెట్టుకున్నా.. సమూహాలుగా కలిసి జీవించడం అనేది కేవలం ప్రకృతి ద్వారా మాత్రమే మనం నేర్చుకున్న విద్య. అలాగే ఇప్పటికీ మనకు చాలా అలవాట్లను ప్రకృతే నేర్పుతుంది. ప్రకృతి నేర్పే అలవాట్లు చాలా సహజసిద్ధంగా, అసంకల్పితంగా తెలియకుండానే మనకు అలవాటు అయిపోతాయి.

ఓ సుభాషితం చూస్తే మనకు ఆ సంగతి ఇంకా బాగా అర్థమవుతుంది. మనలో చాలా మందికి ఉండే ఒక లక్షణం.. కేవలం మన తప్పిదం మాత్రమే కాకపోవచ్చునని.. ప్రకృతే మనకు అనాదిగా అలవాటు చేసిందని కూడా అనిపిస్తుంది.

వనాని దహతో వహ్నేః సఖా భవతి మారుతః
స ఏవ దీప నాశాయ కృశే కస్యాస్తి సౌహృదమ్

అగ్ని కీలలు అడవిని దహించి వేస్తున్నప్పుడు గాలి దానికి తోడుగా ఉండి.. మరింత వేగంగా దహించి వేయడానికి సహకరిస్తుంది. అదే అగ్ని ఒక చిన్న దీపం రూపంలో వెలుగుతూ ఉన్నప్పుడు.. అదే గాలి దానిని ఆర్పివేయడానికి  ప్రయత్నిస్తుంది. .. అంటుంది ఈ సుభాషితం.

ఈ సుభాషితం నుంచి మనం ఎంత నేర్చుకోగలిగితే అంత నేర్చుకోవచ్చు. తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత అనే నానుడికి ఇది సరిపోతుంది. ఎన్ని రకాలుగా మనం దీనిని విశ్లేషించుకోగలం, ఎన్ని రకాలుగా దీనిని అర్థం చేసుకోగలం అనేది మన మన శక్తి సామర్థ్యాలు, దృక్పథాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ ప్రధానంగా ఇది చెప్పగల తత్వం మాత్రం అవకాశవాదం.

గాలి అనేది చంచలమైనది. ఈ సందర్భంలో అవకాశవాదానికి అది ప్రతీక. మంట బలవంతమైన రూపంలో ఉన్నప్పుడు.. మరింత ఎగదోస్తుంది. చిన్న దీపాన్ని ఆర్పేస్తుంది. అవకాశవాదం పోతపోసిన వ్యక్తులు మనకు నిత్యం ప్రతి సందర్భంలోనూ తారసిల్లుతుంటారు. శక్తి, సంపద, అధికారం ఉన్నచోట క్షణాల్లో ఈగల్లా ముసురుతారు. ఆ వైభవం వెలుగులీనినంత కాలం.. వారిచుట్టూ పరిభ్రమిస్తూ వారికి అనుకూలంగా మాట్లాడుతూ పనులుచేస్తూ ఉంటారు. కానీ.. అదే శక్తిసంపదలు సన్నగిల్లిపోయిన తర్వాత.. చిటికెలో అదృశ్యమైపోతారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే చిదిమేయడానికి చూస్తారు. ఇది లోకనైజం.

గాలి నేర్పే అవకాశవాదం మనకు ఈ సుభాషితంలో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ.. జీవితాన్ని సక్రమంగా తీర్చిదిద్దుకోవాలంటే.. అగ్ని నేర్పే పాఠాన్ని మనం గ్రహించాలి. గాలి లాంటి అవకాశవాదులు సహకరించినప్పుడు ఎడాపెడా చెలరేగిపోవడం తప్ప, చిన్న దీపం స్థాయిలో ఉన్నప్పుడు బిక్కుబిక్కుమంటూ కొడిగట్టిపోవడం తప్ప ఇంకా అందులో నేర్చుకోవాల్సిన పాఠం ఏముంటుంది? అని మనకు అనిపిస్తుంది. ఇందులోని కీలకం అదే.

మన దగ్గర శక్తి సామర్థ్యాలు సంపదలు పుష్కలంగా ఉన్నప్పుడు మన చుట్టూ చేరే వాళ్లు, మనకు సహకరించేవాళ్లు చాలామంది కనిపిస్తారు. మనం జాగ్రత్త పడాల్సింది ఏమంటే.. వాళ్లంతా గాలి లాంటివాళ్లు. మనం చిన్న దీపంగా ఉన్నప్పుడు మనల్ని కడతేర్చడానికి కూడా వెనుకాడరు.

అలాగే.. అవకాశవాదుల తీరు ఎలా ఉంటుందంటే.. పచ్చటి అడవిని దహించివేయడం వంటి దుర్మార్గపు పనులు చేయడానికే వారు మనకు సహకరిస్తూ ఉంటారు. అదే సమయంలో.. వెలుగులు పంచే దీపం వంటి మంచి పనులు చేయడానికి వారు సహకరించరు. ఆ మంచిపనులు చేసే ప్రయత్నాన్ని తుదముట్టించడానికి ప్రయత్నిస్తారు.

గాలివాటుగా బతకడం అనేది మనం తరచుగా వింటూ ఉంటాం. ఒక నిర్దిష్ట జీవితలక్ష్యం ఏమీ లేకుండా.. పరిస్థితులు ఎలా నడిపిస్తే అలా సాగిపోయే వారికి ఈ మాట వర్తిస్తుంది. నిజానికి.. గాలి అవకాశవాద తీరుకు లోబడిపోయే తీరును కూడా గాలివాటుగానే పేర్కొనాలి.

వేదకాలంనుంచి మనం దేవుడిగానే కొలుస్తున్నప్పటికీ.. ఈ దృష్టాంతంలోని అగ్ని మూర్ఖమైనది కాబట్టి.. గాలి ఆడించినట్టల్లా ఆడుతోంది. మనుషులు తెలివైన వాళ్లు కాబట్టి.. గాలివాటుగా అవకాశవాదుల ఉచ్చులో చిక్కుకుపోకుండా.. కాసింత సంపద చేరగానే మనచుట్టూ మనకు సహకరించే వారుగా కొత్త అవతారం ఎత్తిన మిత్రులను చూసుకుని మురిసిపోకుండా.. అప్రమత్తంగా ఉండడాన్ని నేర్చుకోవాలి. అలాగే అవకాశవాదం అంటే ఎలాంటిదో అర్థమైంది కాబట్టి.. వీలైనంత వరకు దానికి లోబడకుండానే రోజులు వెళ్లదీయాలి.

శుభోదయం

Tags: BhartrihariBhartrihari subhashithamgood morninggood morning thoughtquotes on agriculturequotes on good thoughtssubhashitamsubhashithamwhat to sowwhat you sow is what you reapభర్తృహరి సుభాషితంమంచిమాటశుభోదయంసుభాషితం
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

28 జూన్ 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

28.6.26 ‘కథానిధి’ సమీక్ష: వర్తమాన సామాజిక వాస్తవికత

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply