• About Us
  • Contact Us
  • Our Team
Wednesday, July 22, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

Good Morning : పలుకు తేనియలూరగ..

admin by admin
December 13, 2021
0
Good Morning : పలుకు తేనియలూరగ..

నిజం చెప్పడం చాలా కష్టం. ఈ విషయం అందరూ ఒప్పుకుంటారు. అబద్ధం చెప్పడం ఇంకా చాలా కష్టం. చాలా మంది ఒప్పుకోరు. సులువు అంటారు. కానీ, అబద్ధం చెప్పడం కూడా కష్టం అని అందరూ ఒప్పుకునేలా చేయగల మాట ఒకటి ఉంది. The greatest advantage in saying truth is you need not to remember whatever you said అని.

నిజం చెప్పడంలో ఉన్న లాభం. మనం ఏం చెప్పామో దాన్ని గుర్తు పెట్టుకోవడానికి కష్టపడక్కర్లేదు. అది నిజంగనుక సహజంగానే గుర్తుంటుంది. అబద్ధంలో చెప్పడంలో అతిపెద్ద కష్టం కూడా అదే. ఎప్పుడు ఏం చెప్పామో, ఎవరికి ఏం చెప్పామో చాలా బాగా గుర్తు పెట్టుకోవాలి. అలా గుర్తు పెట్టుకోవడం చాలా కష్టం. కేవలం ఈ సిద్ధంతాన్ని ఆధారం చేసుకునే.. అందమైన క్రైం కథ అల్లికతో.. దృశ్యం పేరుతో రెండు భాగాలుగా సినిమాలు కూడా వచ్చాయి.

నిజం- అబద్ధం చెప్పడంలోని కష్టనష్టాలు సరే. అది చాలా పెద్ద చర్చ. మొత్తం చర్చించుకోలేకపోయినా.. ఎదుటివాళ్లతో సంబంధ బాంధవ్యాల విషయంలో మాట తీరు ఎలా ఉండాలి. ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? అనే సంగతులను మనం మాట్లాడుకోవచ్చు.

ఈ విషయంలో మను స్మృతి చెప్పే ఒక శ్లోకం ఇలా ఉంటుంది.

సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్
న బ్రూయాత్ సత్యం అప్రియం
ప్రియం చ న అనృతం బ్రూయాత్
ఏషత్ ధర్మః సనాతనః

నిజం చెప్పాలి. ఎదుటి వారికి నచ్చే విషయం చెప్పాలి. నిజం- ఎదుటివారికి చేదుగా ఉండేట్లయితే చెప్పవద్దు. అలాగని, ఎదుటివారికి రుచిగా ఉంటుందని అబద్ధం చెప్పకూడదు. సనాతన ధర్మం చెప్పేది ఇదే. –అనేది శ్లోకభావం.

మనువును మనలో చాలా మంది చాలా విషయాలకు తిడుతూ ఉంటారు. అవన్నీ మనం మననం చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ.. మనువు చెప్పిన వాటిలో, మంచి మాటలు అనిపించిన కొన్నింటిని గుర్తు చేసుకోవడంలో తప్పు లేదు.

ఇతరులతో సంబంధ బాంధవ్యాలు నెరపే విషయంలో  మనం పలికే మాట చాలా కీలకంగా ఉంటుంది. ఒక వ్యక్తి ఎంత మంచివాడు అయినా.. పుల్లవిరుపుగా, పరుషంగా, నొప్పించేలా మాట్లాడే అలవాటు ఉంటే అతనితో ఎక్కువమంది కలవరు.

ఈ శ్లోకానికి మనం రెండు రకాలుగా అర్థం చెప్పుకోవచ్చు. రెండు రకాల బంధాలు కొనసాగించే ఆప్తులతో ఈ రెండు పద్ధతులను పాటించవచ్చు.

ఒకటో పద్ధతి-

‘‘నిజం చెప్పాలి. ఎదుటి వారికి నచ్చేదే చెప్పాలి. వారికి నచ్చని విషయం చెప్పనే వద్దు. నచ్చుతుందని అబద్ధం చెప్పొద్దు.’’

alo read :  మాటే మంత్రమూ .. ఇతరులతో మాట్లాడే పద్ధతి

నచ్చని విషయం స్వీకరించే వాళ్లు, దాన్ని ఒప్పుకునే వాళ్లు చాలా తక్కువమంది ఉంటారు. అలాంటి వాళ్లతో మాట్లాడే విషయంలో ఈ సూత్రం పాటించాలి. ఎదుటివాడిలో లోపం కనిపిస్తే.. చెబితే అర్థం చేసుకోడు అని మీకు అనిపిస్తే అసలు చెప్పనే వద్దు. ఎదుటి వాళ్లను సంస్కరించడానికి మీరు జన్మించలేదు కద. మీకు ఏ లోపమైతే కనిపించిందో.. ఆలోపం మనలో లేకుండా ఉంటే చూసుకుంటే చాలు. ఎదుటి వారికి చెప్పాల్సిన అవసరం లేదు.

రెండో పద్ధతి-

ఎదుటివాళ్లు మీకు కొంచెం ఎక్కువ ఆప్తులు. లోపాల్ని చెబితే వాళ్లు కూడా స్వీకరించే తరహా కాదు గానీ.. వాళ్లకు చెప్పడం మీ విధి. ఎందుకంటే వారు మీ సొంత ప్రపంచంలో ఒక భాగంగా మారిపోయినంతటి ఆప్తులు. మరి వారి విషయంలో ఏం చేయాలి? రెండో తరహాలో ఈ శ్లోకాన్ని మనం అర్థం చేసుకోవాలి.

EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి

నిజం చెప్పాలి. ఎదుటివారికి నచ్చేవిధంగా చెప్పాలి. ‘న బ్రూయాత్ సత్య మప్రియం’ అనే ఒక్క వాక్యానికే భిన్నమైన అర్థాన్ని తీసుకోవాలి. ఎదుటివారికి నచ్చకుండా ఉండేలాగా, నొచ్చుకునేలాగా, అప్రియమైన రీతిలో చెప్పకూడదు. సత్యం చెప్పాల్సిందే.. కానీ చెప్పే పద్ధతి.. ఎదుటివారిని మెప్పించాలా ఉండాలి.

రెండు రకాలుగా అర్థం చెప్పుకున్నా.. రెండు సంగతులు మాత్రం కామన్. నిజం మాత్రమే చెప్పాలి. అబద్ధం ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు.

ఎదుటివాళ్లకు నచ్చే విషయం మాత్రమే చెప్పడం లేదా నచ్చే విధంగా మాత్రమే చెప్పడం గురించి ఈ శ్లోకం మనకు వివరిస్తుంది. ఈ తీరును కూడా తప్పుపట్టేవాళ్లు అనేకులు ఉంటారు. అది లౌక్యం అని, నిజాయితీగా ఉండలేని వాళ్లు, మాటలకు ముసుగు వేసుకునే వాళ్లు మాత్రమే ఇలా చెబుతారని ఎవరైనా విమర్శిస్తారు. ప్రియమైన తీరులో చెప్పడం లాంటిదంతా.. మెరమెచ్చు మాటల వ్యవహారమని నిందించేవాళ్లూ ఉంటారు. ఆ మాటలకు నొచ్చుకోకుండా ఉంటే సరిపోతుంది. అలాంటివారితో కూడా మీకు ఎప్పటికీ సత్సంబంధాలే ఉంటాయి.

శుభోదయం.

Tags: BhartrihariBhartrihari subhashithamgood morninggood morning thoughton saying truthquotes on good thoughtssubhashitamsubhashithamన బ్రూయాత్ సత్య మప్రియంప్రియం బ్రూయాత్భర్తృహరి సుభాషితంమంచిమాటశుభోదయంసత్యం బ్రూయాత్సుభాషితం
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

28 జూన్ 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

28.6.26 ‘కథానిధి’ సమీక్ష: వర్తమాన సామాజిక వాస్తవికత

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5.7.26 ‘కథానిధి’ సమీక్ష: సామాజిక రుగ్మతలపై అక్షరాల తిరుగుబాటు

12.7.26 ‘కథానిధి’ సమీక్ష: సమకాలీన జీవిత వైరుధ్యాలు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply