• About Us
  • Contact Us
  • Our Team
Tuesday, September 15, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

Good Morning : కష్టనష్టాలలో అందం, ఆనందం!

admin by admin
September 27, 2021
0
Good Morning : కష్టనష్టాలలో అందం, ఆనందం!

ఆధునిక ప్రపంచం.. వ్యక్తిత్వ వికాసం అంటే ‘విజయం మాత్రమే’ అని చెప్పడాన్ని అలవాటు చేసుకుంది. విజయాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా నిర్వచిస్తారు. అప్రతిహతంగా గెలుచుకుంటూ పోవడం మాత్రమే విజయం అనే వారు కొందరు. 

ఎదురుదెబ్బలను తట్టుకుంటూ, కష్ట నష్టాలను జయించుకుంటూ ముందుకు సాగిపోయేదే విజయం అని చాలా మంది చెబుతూ ఉంటారు. కష్టనష్టాలు అనేవి.. ప్రతి ప్రస్థానానికి ఒక రకంగా అనివార్యం. కానీ.. ప్రతి వ్యక్తిత్వ ఉపదేశం కూడా వాటిని నెగటివ్ షేడ్ లోనే చెబుతుంటుంది. ఇది కరక్టేనా?

విజయం- అంటే కష్టనష్టాలు ఉండనే కూడదని అనుకుంటూ పెరిగే వారు కొందరుంటారు. ఆర్థిక, సంపదల కొలబద్ధలమీద చూసినప్పుడు.. వీరిని మనం born with golden spoon అని అంటుంటాం. ఏ సాహసం చేయాలనుకున్నా.. వారికి దేనికీ కొరత ఉండదు. అలా చేసుకుంటూ పోతూనే ఉంటారు. విజయాలు కూడా వారిని వరిస్తూనే ఉంటాయి. అదే తరహాలో మరో తరహా వ్యక్తులుంటారు. వారిని అదృష్టవంతులు అంటాం. ‘వారు పట్టిందెల్లా బంగారమే’ అని కితాబులు ఇస్తూ ఉంటాం. అపజయం ఎరగకుండా ఎదుగుతూ ఉంటారు.

ఆ పయనం సజావుగా సాగినంత వరకు అద్భుతమే.. కానీ.. వరుస విజయాలకు అలవాటు పడిన వారు  కష్టనష్టాలు ఎదురైనప్పుడు, దెబ్బలతో శిథిలమయ్యే పరిస్థితి వచ్చినప్పుడు ఏమైపోతారు?

కష్టాలను జయించడమే కాదు.. మన వ్యక్తిత్వాలకి, వాటిని ఆస్వాదించడం కూడా అలవాటు కావాలి. కష్టాలు ఎదురైనప్పుడు వాటిని జయించాలనే ఆలోచన మరో సవాలును నెత్తికెత్తుకోవడమే. కొన్ని సందర్భాల్లో అది అవసరమే అయినా.. వాటిని ఆస్వాదించడం, ఆ కష్టనష్టాలలో ఉండే మధురిమను కూడా ఆస్వాదించడం అలవాటు అయితే.. జీవితం గొప్పగా ఉంటుంది.

ఒక రకంగా చెప్పాలంటే.. క్రియాశీలులు, కార్యశూరులకు మాత్రమే ఎదురుదెబ్బలు కూడా ఉంటాయి. నిర్వ్యాపారంగా కూర్చునే వారికి ఏ కష్టనష్టాలూ ఉండవు. కాబట్టి.. అవన్నీ కూడా మన కార్యశీలతకు దక్కే ప్రతిఫలాలు మాత్రమే అనుకుంటూ సాగే వారికి ఎంతో నెమ్మది ఉంటుంది.

ఇదే విషయాన్ని భర్తృహరి కూడా తన నీతిశతకంలో చెబుతాడు.

మణిః శాణోల్లీఢః సమర విజయీ హేతి దళితో
మదక్షీణో నాగః శరది సరితః శ్యాన పులినాః 
కలా శేషశ్చంద్రః సురత మృదితా బాలవనితా
తనిమ్నా శోభంతే గళితవిభవా శ్చార్థిషు నరాః

‘‘సాన పెట్టే బాధలను భరించిన రత్నము, యుద్ధంలో ఆయుధాలు చేసిన గాయాలతో నిండి ఉన్న  క్షతగాత్రుడైన వీరుడు, మదము చేత చిక్కిన ఏనుగు, శరదృతువులో కొంచెముగా నిండిన యిసుక దిబ్బలు గలది, ఒక కళ మాత్రమే మిగిలిన చంద్రుడు, శృంగారంలో నలిగిన యువతి, అవసరంలో ఉన్న వారిని ఆదుకోవడానికి ఇచ్చి ధనమంతా కోల్పోయిన జనులూ .. కృశించుట చేతనే ప్రకాశిస్తున్నారు.’’

అద్భుతమైన భావం ఉంటుంది ఇందులో! ఇందులోని ఒక ఉదాహరణతో వ్యక్తిత్వ పాఠాన్ని పోల్చుకుని చూద్దాం. గాయాలు మామూలుగా మనిషి రూపాన్నే దెబ్బతీస్తాయి. మరో పరిభాషలో అందాన్ని దెబ్బతీస్తాయి. కానీ ఒళ్లంతా గాయాలే అయి నెత్తురోడుతున్నా కూడా.. యుద్ధంలో పోరాడే వీరుడు.. ఆ గాయాలతోనే అలవిమాలిన శోభతో కనిపిస్తాడు. ఎంతో గొప్పగా రాణిస్తాడు. ఈ అన్ని ఉదాహరణలు గమనించినప్పుడు.. కష్టనష్టాలు అనేవి.. ప్రతిసారీ మనకు ప్రతికూలాంశాలు మాత్రమే కాదు.. మనలోని ప్రతిభకు నిదర్శనాలు కూడా అని అర్థమవుతుంది.

మనకు ఎదురయ్యే కష్టాలు కూడా అలాంటివే. ఇందులోని రత్నం, యుద్ధ వీరుడు, కృష్ణ చతుర్దశి నాటి చంద్రుడు… ఇవన్నీ కూడా, అప్పుడు ఎదురైన కష్టనష్టాల తర్వాత.. శిథిలమైన తర్వాత..  ఎంతగానో రాణించేవే. శోభించేవే. వర్ధిల్లేవే.

అందుకే కష్టనష్టాల గురించిన భయం గానీ, అవి రానే కూడదనే కోరికగానీ, వాటిని గెలిచే తీరాలనే తాపత్రయం గానీ.. అనవసరం. అవి మన జీవితంలో ఒక భాగం.. వాటిని ఆస్వాదిస్తూ పోతే.. జీవిత నిజమైన రసాస్వాదనలతో అలరారుతుంది.

Tags: enjoy obstaclessubhashitamsubhashithamsuccess secrettake the defeatభర్తృహరి సుభాషితంసుభాషితం
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

‘యుద్ధాలు బలికోరేది మానవత్వాన్నేనా?’

23 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

సురేష్ పిళ్లె: ఘనీభవన స్థితి ‘కడెవర్ భారతి’

చాగంటి ప్రసాద్: యతో కృష్ణ స్తతో జయః

16 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

9.8.26 కథానిధి సమీక్ష: అక్షరాలే అసలైన కాపలాదారులు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply