• About Us
  • Contact Us
  • Our Team
Sunday, July 26, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

చెబితే శానా ఉంది -6 : ‘మీరు ఏమట్లు?’

admin by admin
December 6, 2021
0
చెబితే శానా ఉంది -6 : ‘మీరు ఏమట్లు?’

నా చిన్నతనాల్లో కొత్తవారు ఎవరైనా తారసపడితే నాలుగు ముక్కలు మాట్లాడాక బాహాటంగానే అడిగేసేవారు ‘మీరు ఏమట్లు?’ అని. మీరు ఏ కులస్థులు అని దాని భావం.

‘‘మేం పెసరట్లం. మీరేమిటి మినపట్లా, గారె, వడ, బూందీనా?’’ అని ప్రతిదాడి చేసేవారూ, చమత్కార బాణాలు సంధించేవారూ ఉండేవారు.

ఇప్పుడు మనం మరింత నాగరికులం అయ్యాం కనుక ఇలా బాహాటంగా ఎవరి కులగోత్రాలూ తెలుసుకోవడం లేదు. కానీ మాటల్లో మాటగా, లౌక్యంగా, లోపాయకారీగా ఎదుటివాడి కులమేమిటో శోధించి సాధిస్తున్నాం.

‘మీ ఇంటి పేరేమిటన్నారు? ఓహో! ఫలానా వారు మీ చుట్టాలేనా?’ ఇలా ప్రశ్నల పరంపర వెనక కులమేమిటో తెలుసుకోవాలనే ఉత్సుకత కనపడుతుంది.

మరికొంతమంది ఔత్సాహికులు సస్పెన్స్ భరించలేక ఎదుటివారి చెవి కొరుకుతారు ‘ఫలానా ఆయన మన వాడేనా?’ అని.

ఆఫీసుల్లో బాసుల దగ్గరా, పోలీసు శాఖలో ఎస్ఐ దగ్గర సన్నిహితంగా కింది స్థాయి ఉద్యోగి మెలుగుతూ విశ్వాసపాత్రుడిగా చెలామణీ అవుతుంటే వారిద్దరిని కలిపిన బంధం కులమే అయిఉంటుంది. శాస్త్రీయంగా సర్వే చేసినా తేలే విషయమిది. కాకుంటే కొన్ని మినహాయింపులు ఉండొచ్చు. కులానికి మించిన మరో ప్రయోజనమేదో ఇద్దరినీ సన్నిహితుల్ని చేసి ఉండవచ్చు.

రిక్రూట్‌మెంట్‌లలోనూ చాపకింద నీరులా స్వకులాభిమానం అయస్కాంతంలా ఆకర్షిస్తుంటుంది.

నాకు తెలిసిన జర్నలిస్టు మిత్రుడొకరు ఉన్నారు. ఆయనకు కులాల మీద మంచి పట్టు ఉంది. ఇంటిపేరు చెబితే కులమేమిటో చెప్పగల కీ ఉంది. ఒకే ఇంటిపేరు గల వారు వేర్వేరు కులాల్లో ఉండవచ్చు. మరీ ముఖ్యంగా ఊళ్లపేర్లు ఇంటిపేరుగా ఉన్నప్పుడు అన్ని కులాల్లో ఆ ఇంటిపేరు గల వారుంటారు. ఈ చిక్కుముడినీ విప్పగల విద్య ఆయనకు తెలుసు. ఒక్క తెలుగు కులాలనే కాదు, దేశంలోని ఏ రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో ఎవరేమిటో, వారి కులం మన తెలుగు నేలపై ఏ కులానికి దగ్గరో కూడా చెప్పగల ఘనాపాటి ఆయన. అభిరుచితో అధ్యయనం చేసి ఈ పట్టును ఆ  జర్నలిస్టు మిత్రుడు సాధించాడు. అతనికేమీ కుల ద్వేషాలో, అనురాగాలో లేవు. మన దేశంలో కులాలు వాటి మూలాలు, రాజకీయాల్లో పార్టీల్లో వాటి ప్రాబల్యాలు, ప్రభావాలు అనే అంశం మీద మంచి పుస్తకం రాయండని పోరుతున్నా ఆయన పెన్ను క్యాప్ తీయడం లేదు.

తెలుగువారు ఒలింపిక్స్‌లో రాణించి పతకం తెచ్చుకున్నా, అంతరిక్షయాత్రలో పాల్గొని తిరిగొచ్చినా వారి కులమేమిటో గూగుల్‌లో గాలించేస్తున్నారు. మన కులమే అని నిర్ధారణ అయితే అదో ఆనందం. కొన్ని సార్లు ఈ ఆనందాలు క్షణాల్లో ఆవిరి కూడా అవుతాయి. ఫలానా క్రీడాకారిణి తల్లిదండ్రులది కులాంతర ప్రేమ వివాహం. కనుక పూర్తిగా మన కులం అమ్మాయిగా చెప్పుకోలేం అనే బాధ కొందరిని వెంటాడుతోంది. సినిమా పరిశ్రమలోనూ ఈ తరహా ‘బాధలు’ పడుతున్నారు చాలామంది.  ఈ ధోరణి మరో అడుగు ముందుకు వేసి మా కులం రక్తం ప్రత్యేకం, మాకు కరోనా రాదు అనే దాకా వెర్రి తలలు వేసింది. సోషల్ మీడియాలోనూ ఇలాంటి వెర్రి పైత్యాలు చక్కర్లు కొట్టాయి.

ఈ కుల జాడ్యం శాఖోపశాఖలుగా విస్తరించి తన ప్రతాపం చూపుతోంది. లెఫ్టా, రైటా, మావోయిస్టా- ఈ భావజాల ప్రపంచంలోనూ కులమే రాజ్యమేలుతోంది.

ఈ కులమే మరో శాఖగా ‘ప్రాంతానికీ’ పాకింది. ఎవరిది ఏ ప్రాంతం అనే ఆరాలు తీసి, మన ప్రాంతీయుడే అని తేలాక హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని, మన ప్రాంతం సరే, మన కులం వాడేనా? అనే అన్వేషణ కొనసాగిస్తున్నారు.

అమెరికాకు వెళ్తే ఏ రాష్ట్రం, ఏ భాష వారయినా సరే భారతీయులు తటస్థ పడితే ఆనందం కలిగేది. వాకింగ్‌లో, డ్రైనేజి మూతలపై ‘మేడ్ ఇన్ ఇండియా’ అని చూడగానే మహదానందం. ఆ మూతల్లోనూ మన మూలాలేవో కనిపించేవి.

వాకింగ్‌లో వరసగా రెండు రోజుల పాటు ఒకమ్మాయి తారసపడింది. నన్ను చూడగానే ఆ అమ్మాయి ముఖం విప్పారేది. నేనూ ఇండియన్‌ని కావడం ఆవిడ ఆనందానికి కారణమనుకున్నాను. మూడవ రోజు ఉండబట్టలేక ‘అంకుల్ ఆర్ యూ ఫ్రం కేరళ?’ అని అడిగేసింది. నా ముఖంలో మళయాళీ ఛాయలు ఆ అమ్మాయికి కనపడి ఉండవచ్చు.

EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి

ఒకసారి అమెరికాలోని స్థానిక తెలుగు సంఘం వారు ఎన్టీఆర్ జయంతిని ఒక హోటల్లో నిర్వహిస్తుంటే నేనూ వెళ్లాను. ఎన్టీఆర్ సినీ రాజకీయ జీవితాలతో ముడిపడి ఆయన నటించిన సినిమాల్లోని పాటలతో పోటీలు నిర్వహించారు. ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టిన పథకాలు, పాలన విశేషాలతో క్విజ్ కూడా నిర్వహించారు. ఉత్సాహభరితంగా కార్యక్రమం సాగిపోతోంది.

నా టేబుల్ ఎదురుగా కూచున్న పెద్దాయన మాట కలిపాడు. పిల్లల్ని చూసేందుకు వచ్చాడట. ఆ మాటా ఈ మాటా అయ్యాక-

‘మన కులం వాళ్లందరూ వస్తారని నేనూ వచ్చాను’ అని తేల్చాడు.

ఎన్టీఆర్‌ను అంతర్జాతీయ వేదికపై ఆవిష్కరించారని ఆనందించాలో, ఒక కులానికి కుదించారని బాధపడాలో తెలీక కొట్టమిట్టాడాను.

..డాక్టర్ గోవిందరాజు చక్రధర్

Tags: chakradharchebithe sana undigovindaraju chakradhargovindaraju chakradhar experiencesjournalist govindaraju chakradharmeeru journalist kavachurachana chakradharview pointwriter's bluesగోవిందరాజు చక్రధర్గోవిందరాజు చక్రధర్ జీవితానుభవాలుచెబితే శానా ఉందివ్యూ పాయింట్
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

28 జూన్ 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

28.6.26 ‘కథానిధి’ సమీక్ష: వర్తమాన సామాజిక వాస్తవికత

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5.7.26 ‘కథానిధి’ సమీక్ష: సామాజిక రుగ్మతలపై అక్షరాల తిరుగుబాటు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply