ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి మండలం రాచగున్నేరిలో ఆరోగ్య కేంద్రం శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సీవోవో సురేష్ కొండేల్ వాల్ మాట్లాడుతూ… పరిసర గ్రామీణ ప్రాంతంలో ఉన్న వారు ఎవరైనా రాచగున్నేరిలో ఏర్పాటు చేసిన ఆరోగ్య కేంద్రంలో ఉచితముగా పరీక్షలు చేయించుకుని.. మందులు తీసుకోవచ్చన్నారు.
అత్యవసర పరిస్థితిలో కూడా ఉచిత అంబులెన్స్ సదుపాయము ఉంటుందన్నారు. అవసరమైన వారు 9959553466 నంబరుకు ఫోన్ చేయాలని కోరారు.
ఈ సమావేశంలో సీనియర్ జీఎం దొరై రాజ్, పీఆర్వో o అభిషేకం, సీఎస్వో నరేంద్ర బాబు, డాక్టర్లు హరికృష్ణ, శ్రీహరి, రాచగున్నేరి, చిందే పల్లి, చటర్జీ నగర్ కోళ్ల ఫారం, చల్ల పాలెం, మన్నసముద్రం గ్రామాల నుంచి సుమారు రెండు వందల మంది పాల్గొన్నారు.
.