పెర్ఫార్మెన్స్ కు అవకాశం ఉంటుందని నటులు అనుకోవచ్చు గానీ.. అఘోర పాత్ర చేయడం అంటే.. డీగ్లామర్ రోల్ చేయడమే. కానీ.. చాలామంది నటులకు అలాంటి డీగ్లామర్ పాత్రలతో అభిమానుల్ని మెప్పించాలనే కోరిక ఉంటుంది. మరి ఎక్సెంట్రిక్ పాత్రలకు పేరుమోసిన హీరో.. అఘోరగా ప్రజల్ని ఎలా మెప్పిస్తాడో?
విశ్వక్‌సేన్.. నవతరం హీరోగా తనను తాను నిరూపించుకున్నాడు. తన చిత్రాల్లో ఆద్యంతం వ్యక్తం అయ్యే ఎక్సెంట్రిక్ భావజాలంతో యూత్ కు కనెక్ట్ అయ్యాడు. అయితే తాజాగా అఘోర పాత్రతో ఓ చిత్రం చేయడానికి పూనుకోవడం మాత్రం సాహసం అనే అనిపిస్తోంది.
ఎప్పటికప్పుడు సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే హీరో విశ్వక్ సేన్ అనే సంగతి అందరికీ తెలుసు. తాజాగా విశ్వక్‌సేన్ మరో ప్రయోగం చేస్తున్నారు. సరికొత్త జోనర్ ను తన కొత్త సినిమా కోసం ఎంచుకున్నారు. ఆ సినిమా పేరు గామి.
తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదల అయింది. అద్భుతమైన టెక్నికల్ వ్యాల్యూస్.. అత్యున్నతమైన విజువల్స్ తో టీజర్ ను రూపొందించారు. ఇందులో హీరో విశ్వక్ సేన్ అఘోర పాత్రలో నటిస్తున్నారు. అందమైన హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్‌సేన్ అఘోర పాత్ర చేయడం ఒక ఎత్తు అయితే.. హీరో లేకుండానే.. టీజర్ రూపొందడం ఇంకో తమాషా.
టీజర్ లో విశ్వక్‌సేన్ కనిపించకపోయినా 2-3 షాట్స్ లో ఆ ఫీల్ ను మాత్రం చూపించారు. విద్యాధర్ కాగిట ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా V సెల్యులాయిడ్, కార్తీక్ శబరిష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
.