పవన్ కల్యాణ్ లోని మానవతామూర్తి మరోసారి స్పందించారు. బాధాకరమైన ఒక దుర్ఘటనని రాజకీయం చేయడానికి అనేక మంది తమ తమ ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఆయన మానవత్వంతో స్పందించారు. హైదరాబాద్ నగర పరిధిలోని సైదాబాద్ లో హత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పరామర్శించారు.
జంటనగరాలు పవన్ కల్యాణ్ కు కీలకమైన రాజకీయ క్షేత్రం కాదు. తెలంగాణ రాజకీయాల మీద ఆయన కీలకంగా ఫోకస్ పెట్టడం లేదు! అయినా సరే, అలాంటి అంశాలేవీ ఆయన పట్టించుకోలేదు. బాధాకరమైన దుర్ఘటన, పసిపాప పట్ల జరిగిన అన్యాయం తనను కలచివేయగానే నేరుగా మానవత్వంతో స్పందించారు. వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ధైర్యం చెప్పారు.
హత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబానికి న్యాయం జరిగే వరకు, దోషికి సరైన శిక్ష పడే వరకు జనసేన పార్టీ అండగా ఉంటుందని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. చిన్నారికి జరిగిన దారుణం తనను ఎంతగానో కలచివేసిందని తెలిపారు. అంతా సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన ఇది అన్నారు. హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో హత్యాచారానికి గురైన ఆరేళ్ల చిన్నారి కుటుంబాన్ని బుధవారం సాయంత్రం పరామర్శించారు. ఆ బిడ్డ తల్లిదండ్రులను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు.
ఇవి కూడా చదవండి :
పవన్ కల్యాణ్ పార్టీ ఒక్కటే అసలైన జాతీయ పార్టీనా?
ఎమ్మెల్యే రోజా కార్చిన కన్నీళ్లు చెప్పే వ్యక్తిత్వ వికాస పాఠాలేమిటి?
అసలైన ‘‘శృంగారం’’ అంటే ఏమిటి?
అనంతరం మీడియాతో మాట్లాడుతూ “చిన్నారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. సభ్య సమాజం మాట్లాడుకోలేని ఘోరమైన సంఘటన ఇది. ఆడుకోవడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లిన బిడ్డ కనబడకుండా పోతే ఆ తల్లిదండ్రులకు ఏమయ్యిందో అర్థం కాని పరిస్థితి. వినాయక చవితి కావడంతో విగ్రహాల వెంట వెళ్లిందేమోనన్న అనుమానంతో సరూర్ నగర్ ట్యాంక్ బండ్ నుంచి అన్ని ప్రాంతాల్లో వెతికారు. ఒక ఇంటి మీద అనుమానం ఉంది చూడమంటే పోలీసులు సకాలంలో చర్యలు తీసుకోలేకపోయారు.
పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు చనిపోయిన బిడ్డకు న్యాయం జరగాలని కోరుకోవాలి. ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పెద్దలకు నా విన్నపం.. మంత్రి వర్గంలోని పెద్దలను పంపి బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులకు భరోసా కల్పించండి. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు బాధితులకు ఓదార్పు అవసరం. ఆ కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేయగలమో ఆలోచించి చేయాలని కోరుకుంటున్నాను అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
.