రిలయన్స్ జియో తన ట్రూ 5జీ సేవలను తెలంగాణ లో వేగంగా విస్తరిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 10 నగరాల్లో… హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, రామగుండం, మంచిర్యాల లో రిలయన్స్ జియో తన ట్రూ 5G సేవలను ప్రారంభించింది.
హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ మినహా మిగతా నగరాల్లో 5G సేవలను అందిస్తోన్న ఒకే ఒక టెలికాం నెట్వర్క్ కావడం విశేషం. ఈ ఏడాది చివరి నాటికి తెలంగాణ లోని ప్రతి పట్టణం, తాలూకా, మండలం, గ్రామాల్లో జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి.
జియో ట్రూ 5జి సేవల ప్రారంభంతో తెలంగాణ ఉత్తమ టెలికమ్యూనికేషన్ నెట్ వర్క్ ను పొందడమే కాకుండా, ఇ-గవర్నెన్స్, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఐటి మరియు ఎస్ఎమ్ఇ వ్యాపార రంగాలలో వృద్ధి అవకాశాలకు తలుపులు తెరుస్తుంది. జియో ట్రూ 5 జి పౌరులు, ప్రభుత్వం రియల్ టైమ్ ప్రాతిపదికన కనెక్ట్ అయ్యేందుకు వీలు కల్పిస్తుంది. చిట్టచివరి అడుగు వరకు ప్రభుత్వ పథకాల అమలు సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
ఈ సందర్భంగా జియో తెలంగాణ సీఈఓ కే సీ రెడ్డి మాట్లాడుతూ “తెలంగాణ లో జియో ట్రూ 5జీని వేగంగా విస్తరించడం పట్ల సంతోషంగా ఉంది. జియో ట్రూ 5జీ నెట్ వర్క్ అతి తక్కువ సమయంలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తుంది. జియో ఇంజనీర్లు ప్రతి భారతీయుడికి ట్రూ -5 జి ప్రయోజనాలను అందించడానికి 24 గంటలు పనిచేస్తున్నారు.
అందువల్ల ఈ గణనీయమైన మార్పుకు ఉన్న శక్తి, దాని అపార ప్రయోజనాలను మన దేశంలోని ప్రతి పౌరుడు అనుభవించగలడు. తెలంగాణ ను డిజిటలైజ్ చేసి ముందుకు తీసుకెళ్లడంలో సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము” అన్నారు.
ఈ నగరాల్లో 5G సేవలను పొందాలనుకునే జియో వినియోగదారులకు జియో వెల్కం ఆఫర్ ఆహ్వానం అందుతుంది. దీనిద్వారా వారు అదనపు ఖర్చు లేకుండా 1 జిబిపిఎస్ + వేగంతో అపరిమిత డేటాను పొందవచ్చు.
.