శ్రీసిటీలోని మల్టీనేషనల్ కంపెనీకోసం 150 ఉద్యోగాల రిక్రూట్ మెంట్ కు ప్రకటన వెలువడింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపణ్యాభివృద్ధి సంస్థ తిరుపతి జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎన్. శ్యామ్ మోహన్ ఒక ప్రకటన విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ తిరుపతి జిల్లా ఆధ్వర్యంలో ఇండస్ట్రీ ట్రైనింగ్ మరియు ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా శ్రీ సిటీలోని ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీ NS INSTRUMENTS India Pvt Ltd లో ట్రైనీ ఉద్యోగాల కొరకు యువతీ యువకులు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 150 ఖాళీలు భర్తీ చేస్తారు.
ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్: 2020,2021,2022 లో ఉత్తీర్ణత అయిన డిప్లమా (EEE,ECE, Mechanical) లేదా డిగ్రీలో బీఎస్సీ (MPC/MPC’s/MSC’s/Electronics) ఉత్తీర్ణత కలిగిన యువతీ యువకులు.
జీతం : 13200/- Per Month మరియు షిఫ్ట్ అలవెన్సెస్ మరియు మొదటి మూడు నెలలు ఉచిత భోజనం మరియు హాస్టల్ సదుపాయం కలదు.
వయోపరిమితి :18-25 సంవత్సరాల మద్య ఉండాలి.
ఇతర వివరాలకు ఈ క్రింద ఇవ్వబడిన రిజిస్ట్రేషన్ లింకు లో ఖచ్చితముగా నమోదు చేసుకోవలెను https://forms.gle/7TDbBfUXyBJ1hLid8
రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ 22-10-2022. ఆసక్తి కలిగిన యువతీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసినదిగా జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి తెలియజేశారు. మరిన్ని వివరాలకు ను+918121585857 సంప్రదించగలరు.

.