ఆదివారం వెలువడనున్న ఫలితాలలో- జోతిష్యం ప్రకారం బిగ్ బాస్ 5 తెలుగు ట్రోఫీని సన్నీ కైవశం చేసుకోనున్నాడు. ప్రస్తుతమున్న టాప్ ఫైవ్‌లో సన్నీ ఒక్కడికే గెలుపు సూచనలున్నాయి. టాప్ ఫైవ్ లోని కంటెస్టెంట్ల పేర్లను బట్టి బిగ్ బాస్- 5 ట్రోఫీని సన్నీ అందుకునేందుకు శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి.
టాప్ ఫైవ్ లో శిరి గెలుపు స్థానంలో రవి బుధులున్నా బహుళపక్ష చంద్ర దృష్టి వున్నది. కాబట్టి అవకాశమే లేదు.
టాప్ ఫైవ్‌లో మానస్ గెలుపు స్థానంలో రాహువు ఉచ్చ స్థితిలో వున్నా, కేతుకుజ ల దృష్టి వున్నది. కాబట్టి అవకాశమే లేదు.
టాప్ ఫైవ్ లో శ్రీ రామచంద్ర గెలుపు స్థానాధిపతి బహుళపక్ష చంద్రుడు వ్యయంలో ఉండగా, ఆ స్థానానికి శత్రువులైన శనిశుక్రల దృష్టి వున్నది. కాబట్టి అవకాశమే లేదు.
టాప్ ఫైవ్ లో షణ్ముఖ్ గెలుపు స్థానాధిపతి బుధుడు మిత్రుడైన రవితో కలిసివున్నా శత్రువు ఇంట వున్నాడు. అలాగే గెలుపు స్థానంలో బహుళపక్ష చంద్రుడు శత్రువు ఇంట వున్నాడు. కాబట్టి అవకాశమే లేదు. టాప్ ఫైవ్ లో- ఇక మిగిలినది సన్నీ ఒక్కడే.
సన్నీ అసలుపేరును బట్టి గెలుపు స్థానాధిపతి స్వక్షేత్రములో ఉండడం మరియు ధన, కీర్తి అధిపతి మిత్రునితో కలిసి ఉండడం జరిగింది. అలాగే సన్నీ ప్రకారం చూసినా గెలుపు స్థానాధిపతి స్వక్షేత్రములో ఉండడం, మోక్ష కారకుడైన కేతువు ఉచ్చ స్థితిలో కలిసి ఉండడం వలన ఓరకంగా గెలుపు తథ్యమని తెలుస్తోంది.
ఏది ఏమైనా ఆదివారం రాహుకాలం అనంతరం వెలువడే ఫలితాలకోసం తెలుగు టీవీ ప్రేక్షకుల ప్రపంచమే ఎదురు చూస్తోంది. మనము వేచి చూద్దాం.
.. హరగోపాల్
జ్యోతిష్య పండితుడు, హైదరాబాద్
.