తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతోనే వెనుకబడిన కులాల జీవితాల్లో వెలుగు సాధ్యమని ఆ పార్టీ నేత కన్నావరం హరిబాబు అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో యువతకు 40శాతం ఎమ్మెల్యే సీట్లు కేటాయిస్తామని మహానాడులో చంద్రబాబు ప్రకటించడం అభినందనీయమన్నారు.
యువతను రాజకీయాల్లో ప్రోత్సహించాలనే ప్రధాన ఆశయంతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసకున్నారని హరిబాబు చెప్పారు. రాజకీయాల్లో అనేక సంస్కరణలకు మూలపురుషుడు చంద్రబాబేనని ఆయన తెలిపారు. నేడు వైసీపీ అమలు చేస్తున్న అనేక పథకాలు చంద్రబాబును చూసి కాపీ కొట్టినవేనని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ అంటే బీసీలని… బీసీలను ఆదరించిన ఏకైక పార్టీ టీడీపీనేనని ఆయన చెప్పారు.
ఓట్ల కోసం వైసీపీ బీసీలకు మాయమాటలు చెబుతోందన్నారు. బీసీలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నందుకు వారికి అనేక సంక్షేమ పథకాలు ఆపేసిన ఘనన వైసీపీకే దక్కిందన్నారు. బీసీలు ఎవరూ వైసీపీ మాయలో పడకూడదని ఆయన కోరారు. ఇక వైసీపీ పాలనలో సామాన్యుల బతుకు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ధరల పెరుగుదలతో పేదవారు పస్తులతో కాలం వెళ్లదీయాల్సి వస్తోందన్నారు.
వైసీపీ పానలలో సత్యానికి సమాధి కట్టారని కన్నావరం హరిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించే వారిపై తప్పడు కేసులు బనాయిస్తూ వైసీపీ పాలన కొనసాగిస్తోందని ఆయన ఆరోపించారు. అయినా చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ శ్రేణులు ఎంతో వీరోచితంగా పోరాటాలు చేస్తుండటం అభినందనీయమన్నారు.
రాష్ట్రంలో రాక్షస పాలన పోవాలంటే చంద్రబాబునాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన చారిత్రక అవసరం ఎంతైనా ఉందన్నారు. వైసీపీకి చరమగీతం పాడటానికి అన్ని వర్గాల ప్రజలు టీడీపీకి అండగా నిలవాలని హరిబాబు విజ్ఞప్తి చేశారు.
.