తనను కలెక్టరు చేయగానే.. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు కాళ్లు మొక్కి తన భక్తి ప్రపత్తులను చాటుకున్న వీరభక్త ఐఎఎస్ అధికారికి అదిరిపోయే కానుక దక్కనుంది. ఆయన భక్తికి మెచ్చిన కేసీఆర్ పెద్ద వరమే ఇచ్చారు. ఆయనను ఎమ్మెల్సీగా చట్టసభకు పంపనున్నారు.
సిద్దిపేట జిల్లా కలెక్టరు వెంకట్రామిరెడ్డి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది. ఆయన తెరాస పార్టీలో చేరబోతున్నారు. ఆ వెంటనే ఆయనను ఎమ్మెల్సీగా చట్టసభకు పంపనున్నారు.
వెంకట్రామిరెడ్డి రాజీనామాను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్ ఉద్యోగం నుంచి ఆయన స్వచ్ఛంద పదవీవిరమణ చేశారు. కలెక్టరు గిరీ వదులుకున్నా.. పెద్దపల్లి జిల్లా ఓదెలకు చెందిన సదరు వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీ వరమాలతో ప్రభుత్వంలో మరింత కీలక భూమిక పోషించబోతున్నారు.
1991 లో గ్రూప్-1 అధికారిగా వెంకట్రామిరెడ్డి ఉద్యోగంలో చేరారు. మచిలీపట్నం, చిత్తూరు, తిరుపతి తదితర ప్రాంతాల్లో ఆర్డీవోగా పనిచేశారు. మెదక్‌లో డ్వామా పీడీగాను, హుడా సెక్రటరీ, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. సంగారెడ్డి, సిద్దిపేట కలెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. ఆయన ఏడేళ్లు జేసీగా, కలెక్టర్‌గా పని చేశారు.
సరికొత్త ప్రస్థానంలో రాజకీయ అవతారం ఎత్తబోతున్నారు. గులాబీ కండువా కప్పుకుని ఎమ్మెల్సీగా చట్టసభలో అడుగుపెట్టబోతున్నారు. ఇన్నాళ్లూ కూడా గులాబీ కండువ లేదు తప్ప.. ఆయన కేసీఆర్ భక్తుడిగానే విధులు నిర్వర్తించారు. గతంలో దుబ్బాక ఎమ్మెల్యేగా కూడా బరిలోకి దిగడానికి ఆయన టికెట్ కోసం ప్రయత్నించారని ప్రచారం ఉంది.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
.