పెంచిన గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలని వామపక్ష పార్టీల నేతలు డిమాండు చేశారు. శ్రీకాళహస్తిలో గురువారం సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేశారు.
ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నేతలు మాట్లాడుతూ… కేంద్రప్రభుత్వం ఓ పథకం ప్రకారం ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే ఓ పథకం ప్రకారం పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెంచిందన్నారు.
ఇప్పటికే అనేక మార్లు ధరలు పెంచడం వలన పేద, మధ్యతరగతి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ధరల పెరుగుదలతో సామాన్యుల బతుకు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను నడ్డి విరిచే విధంగా పరిపాలన సాగిస్తోందన్నారు.
పెంచిన ధరలపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించుకోవాలని వారు కోరారు. లేదంటే వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు అంగేరి పుల్లయ్య, జనమాల గురవయ్య, గంధం మణి ఏఐటీయూసీ నాయకులు వైయస్ మణి, మోహన్ రెడ్డి, కార్తీక్, చాముండేశ్వరి, సీఐటీయూ నాయకులు గురవయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.
.