• About Us
  • Contact Us
  • Our Team
Tuesday, August 4, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

ఓటీటీ రివ్యూ : LET HIM GO

admin by admin
June 19, 2026
0
ఓటీటీ రివ్యూ : LET HIM GO

సున్నితమైన కుటుంబ భావోద్వేగాల మధ్య నడిచే కథాంశాలతో కూడిన సినిమాలకు కాలం చెల్లిందని, టీవీ సీరియల్స్ కుటుంబ కథలకు ప్రాధాన్యం ఇస్తున్నందున సెల్యులాయిడ్ ఫార్మాట్ లో మళ్లీ అవే కథలను ఎవరూ చూడరు అనే అభిప్రాయాలను సవాలు చేసే సినిమా లెట్ హిమ్ గో!

నిజానికి ఎంత పెద్ద యాక్షన్ ప్యాక్డ్ సినిమాలు అయినా సరే.. వాటి మూల కథాంశం సున్నితమైన భావోద్వేగాల అల్లికతోనే ఉంటుంది. కానీ థామస్ బెజూకా (Thomas Bezucha) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యాక్షన్ సినిమాను కబ్జా చేసేయడం జరగదు. లారీ వాట్సన్ (Larry Watson) రాసిన Let Him Go నవలను అదే టైటిల్ తో సినిమాగా రూపొందించే ప్రయత్నం చాలా చక్కగా జరిగినట్టు అనిపిస్తుంది. ప్రధాన పాత్రల్లో చేసిన డయానే లేన్, కెవిన్ కాస్ట్‌నర్ కూడా దానికి తగ్గట్టుగానే న్యాయం చేశారు.

కథ :
1961 ప్రాంతాల్లో పశ్చిమ అమెరికా ప్రాంతాల్లోని మోంటానాలో జరిగే కథ ఇది. రిటైర్డు షరీఫ్ జార్జ్ బ్లాక్‌రిడ్జ్, పొలాల మధ్య ఉన్న ఒక రాంచ్ లో కుటుంబంతో సహా నివసిస్తుంటాడు. అతనితో పాటు భార్య మార్గరెట్, కొడుకు జేమ్స్, కోడలు లోర్నా, నవజాత శిశువు మనవడు జిమ్మీ ఉంటారు. ఒకనాడు ఉదయం జేమ్స్ స్వారీ చేస్తూ వెళ్లిన గుర్రం ఖాళీగా తిరిగి రావడాన్ని మార్గరెట్ గమనిస్తుంది. ఏం జరిగిందో తెలుసుకోడానికి జార్జ్ వెళ్లినప్పుడు.. కొడుకు జేమ్స్ చనిపోయిన సంగతిని గుర్తిస్తాడు. గుర్రంస్వారీ చేస్తూ దానిమీదనుంచి కింద పడి మెడ ఎముక విరగడంతో జేమ్స్ మరణించి ఉంటాడు. ఆ కుటుంబాన్ని విషాదం కమ్ముకుంటుంది. రెండేళ్ల తర్వాత కోడలు లోర్నా మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని కొడుకు జిమ్మీతో సహా వెళ్లిపోతుంది. కోడలిని పెళ్లి చేసుకున్న డానీ వీబాయ్ క్రూరుడు. పసివాడైన జిమ్మీని, భార్య లోర్నాను తరచూ కొడుతూ హింసిస్తుంటాడు. ఓసారి షాపింగ్ కు వెళ్లిన సందర్భంలో మార్గరెట్ ఈ సంగతి గుర్తిస్తుంది. మనవడిని తమ వద్దకు తెచ్చేసుకునే ఉద్దేశంతో, మరునాడు, వారున్న ఇంటికి వెళుతుంది. వారు అప్పటికే అక్కడినుంచి ఖాళీ చేసి డకోటాలోని వారి స్వస్థలానికి వెళ్లిపోయినట్టు పొరుగువారిద్వారా తెలుసుకుంటుంది.

ఎలాగైనా సరే తమ మనవడిని వారినుంచి వెనక్కు తీసుకువచ్చి తమ వద్దనే ఉంచుకోవాలని మార్గరెట్ భావిస్తుంది. వారించే ప్రయత్నం చేస్తాడు జార్జ్ బ్లాక్‌రిడ్జ్. తాము ఇంకా పసివాళ్లం కాదని, వృద్ధులం అవుతున్నామని, మనవడు జిమ్మీని అతని తల్లినుంచి వేరు చేయాలనుకోవడం కూడా కరెక్టు కాదని చెప్పే ప్రయత్నం చేస్తాడు. కానీ.. డానీ వీబాయ్ చేతిలో వారిద్దరూ హింసపడుతున్న సంగతి తాను చూశానని చెప్పిన మార్గరెట్ పట్టువీడదు. జార్జి కూడా ఆమెతో కలిసి బయల్దేరుతాడు. కనీసం డానీ వీబాయ్ చిరునామా కూడా తెలియకపోయినా.. వెతికి పట్టుకోగలమనే నమ్మకంతో బయల్దేరుతారు.

ఈ ప్రయత్నంలో వారు మనవడు జిమ్మీని అనుకున్నట్టుగా తమ వద్దకు తిరిగి తెచ్చుకోగలిగారా? ఆ ప్రయత్నంలో వారికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి. వాటిని ఎలా అధిగమించారు? ఏం కోల్పోయారు? ఏం సాధించారు? అనేదే కథ.

నటీనటులు :
మనవడిని వెతుక్కుంటూ వెళ్లే, అనేక సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధపడిన, ఎదురుదెబ్బలు తగిలినా పట్టువదలని వృద్ధ దంపతులుగా కెవిన్ కాస్ట్‌నర్ (Kevin Costner), డయానే లేన్ (Diane Lane) బాగా నటించారు. కోడలు మరొకరిని పెళ్లి చేసుకున్న తర్వాత.. మనవడికోసమే అయినా సరే.. తాము వారి జీవితంలో జోక్యం చేసుకోవడం పరిధికి మించిన విషయమే అవుతుందనే అభిప్రాయాన్ని చాలా సున్నితంగా వ్యక్తీకరించడంలో కెవిన్ బాగా చేశాడు. అలాగే మనవడికోసం స్థిరచిత్తంతో పోరాడ్డానికి సిద్ధమైన నానమ్మగా డయానే లేన్ కూడా బాగా చేసింది. మిగిలిన పాత్రల్లో నటులందరూ ఆయా పాత్రలకు తగ్గట్టు చేసినా.. వారి పాత్ర నామమాత్రమే. డానీ వీబాయ్ తల్లిగా లెస్లీ మాన్‌విలే బాగా చేసింది. జిమ్మీ ప్రస్తావన రానంత వరకు ఎంతో సరదాగా అతిథులైన దంపతులతో ప్రవర్తిస్తూ, జిమ్మీ రాగానే తనలోని క్రూరత్వాన్ని పతాకస్థాయిలో పండించడంలో ఆమె బాగా చేసింది.

సాంకేతికవర్గం :
ఒక నవలను అందులోని సున్నితమైన భావోద్వేగాలు చెడకుండా.. చక్కగా తెరకెక్కించే ప్రయత్నంగా లెట్ హిమ్ గో మనకు కనిపిస్తుంది. నవల చదవకపోయినప్పటికీ.. నవలల వర్ణనలో కనిపించే భావోద్వేగాల వివరణలు అచ్చంగా దృశ్యంగా అనుమాదమై ఇందులో కనిపిస్తాయి. సంగీతం ఎక్కడా సినిమాలోని ఉద్వేగాలను డామినేట్ చేయకుండా హృద్యంగా సాగిపోతుంది. సినిమాటోగ్రఫీ పనితనం కూడా డకోటా ప్రాంతాల్ని, మోంటానా ప్రాంతపు అందాలను చక్కగా చూపించింది.

విశ్లేషణ :
యాక్షన్ కు అవకాశం ఉన్న కథను అసహజమైన పోరాటా కొరియోగ్రఫీతో చెడగొట్టకుండా.. సహజత్వానికి ప్రాధాన్యం ఇస్తూ సాగిన చిత్రీకరణ ఈ సినిమా బలం. సినిమా కథ మాత్రమే కాకుండా.. అడుగడుగునా బాడీ లాంగ్వేజ్ కూడా ఒక ప్రధాన పాత్ర అన్నట్టుగా సినిమా సాగుతుంది. ప్రధానంగా మానవ భావోద్వేగాలకు చిత్రిక పట్టడమే ప్రయారిటీ అన్నట్టుగా ఉంటుంది. ఎక్కడా అసహజమైన పోకడ, పాత్రల ప్రవర్తన ఉండదు. అసహజమైన యాక్షన్ ను చొప్పించడం. అనవసరమైన హైప్ క్రియేట్ చేసే బీజీఎంలు ఉండవు. సినిమా మాధ్యమంలో కెమెరా, బీజీఎం పనితనాలు కథను కూడా డామినేట్ చేసేస్తూ ఉండే రోజుల్లో కథను కథగా ఆస్వాదిస్తూ ప్రశాంతంగా సినిమా చూడాలనుకునే వారికి Let Him Go నచ్చుతుంది.

ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ : డిస్నీ +, హాట్‌స్టార్

Tags: hotstarhotstor movie revielet him golet him go movie reviewott reviewఓటీటీ రివ్యూడిస్నీ ప్లస్లెట్ హిమ్ గో సినిమా రివ్యూసినిమా రివ్యూహాట్ స్టార్
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

5 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

26.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన సామాజిక సంక్షోభాల సజీవ చిత్రణ

5.7.26 ‘కథానిధి’ సమీక్ష: సామాజిక రుగ్మతలపై అక్షరాల తిరుగుబాటు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply