అభివృద్ధి ప్రదాత నారా చంద్రడబాబునాయుడు వందేళ్లు వర్ధిల్లాలని తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ చార్జి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అన్నారు.
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు 73వ జన్మదిన వేడుకలు శ్రీకాళహస్తిలో బుధవారం ఘనంగా నిర్వహించారు.
ఇందులో భాగంగా శ్రీకాళహస్తి టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి అభిమానులకు పంచి పెట్టారు. ఈ సందర్భంగా బొజ్జల వెంటక సుధీర్ రెడ్డి మాట్లాడుతూ… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడంలో చంద్రబాబునాయుడు పాత్ర మరువలేనిదన్నారు.
హైదరాబాదులో ఐటీ సెక్టార్ అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం చంద్రబాబు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనేక రంగాలను చంద్రబాబు అభివృద్ధి చేశారన్నారు. ఇక రాష్ట్రం విడిపోయాక నవ్యాంధ్రను అభివృద్ధి చేయడానికి చంద్రబాబు ఎంతో కృషి చేశారన్నారు.
అప్పట్లో రూ.16వేల కోట్లు లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ఎలాంటి సమస్య రాకుండా ఆయన పాలన చేశారన్నారు. పట్టిసీమ, పోలవరం చంద్రబాబు కృషి ఫలితమేనని చెప్పారు. ఇలాంటి అభివృద్ధి ప్రదాత మళ్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందన్నారు.చంద్రబాబు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు విజయకుమార్, గాలి చలపతి నాయుడు, దశరధాచారి, కంఠా రమేష్, రెడ్డివారి గురవారెడ్డి, ప్రకాశ్ నాయుడు, రేణుకాదేవి, జిలానీ బాషా, ప్రమీలమ్మ, షాకీరాలీ, మునిరాజా యాదవ్, అస్మత్, మస్తాన్, సుబ్బయ్య, గోపి, బుజ్జి, పోలూరు శ్రీనివాసులురెడ్డి, ఎంఎస్ రెడ్డి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎన్టీ ఆర్ విగ్రహం వద్ద చంద్రబాబు జన్మదినం పురస్కరించుకుని శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షులు విజయకుమార్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు.
.