శ్రీకాళహస్తి ఆలయ పాలకమండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి నీ ఘనంగా సత్కరించారు. శ్రీకాళహస్తీశ్వరుని సేవా భాగ్యం కల్పించిన సీఎం జగన్మోహన్ రెడ్డికి, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి నీ పార్టీ కార్యాలయంలో పాలకమండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మరియు పాలక మండలి సభ్యులు గజ పూల మాల, పూల కిరీటంతో ఘనంగా సత్కరించి శాలువాతో సన్మానించారు.
ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి స్థానికులకే శివయ్య సేవా భాగ్యం కల్పించాలన్నా ప్రధాన ధ్యేయంగా రాష్ట్రవ్యాప్తంగా 165 మందికి నామినేటెడ్ పదవులు ఇస్తూ వచ్చిన జీవోను కేవలం ఒక్క శ్రీకాళహస్తికి మాత్రమే ఆ జీవోను అమలు చేయకుండా ముఖ్యమంత్రి గారితో తనకున్న సన్నిహితం తో జీవో ను నిలిపి వేయించి ఎమ్మెల్యేకు స్థానిక నాయకత్వం పై ఉన్న ప్రేమాభిమానాలను కు నిదర్శనం అన్నారు.
15 మంది స్థానిక లతో కూడిన ధర్మకర్త మండలి నీ నియామకం చేసి మహా శివరాత్రి పర్వదినమున ఉత్తర్వులు ఇప్పించి, మా చేత ప్రమాణ స్వీకారం చేయించిన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కి పాలకమండలి రుణపడి ఉందన్నారు.
ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కి తాను వ్యక్తిగతంగా రుణపడి అన్నివేళలా బాసటగా నిలుస్తూ రానున్న రోజుల్లో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మరింత ఉన్నత పదవులు పొంది సుదీర్ఘ ప్రజా సేవలో ప్రజలు మన్ననలు పొందే విధంగా ఆశీర్వదించాలని ఆకాంక్షిస్తున్న మన్నారు.
ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులుబుల్లెట్ జయశ్యామ్. మున్నా రాయల్, రమాప్రభ,మహీధర్ రెడ్డి,పంతులు,పసలసుమతి,జల్లి కృష్ణయ్య,దాసరి జయఅమ్మ,కొండూరు సునీత,చెంచు లతా.ముని లక్ష్మి,పెద్దిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి,శ్రీకాళహస్తి ఈశ్వర్ గురుకుల్.మరియు వైసీపీ నాయకులు.పాల్గొన్నారు.
.