ఆమెజాన్ ప్రైంలో డిసెంబరు 3న విడుదల కానున్న బోం బాట్ చిత్రం కథ ఏంటంటే.. విక్కీని చిన్ననాటి నుంచి కూడా దురదృష్టం వెంటాడుతుంటుంది. చైత్రతో ఆయన రిలేషన్ దానివల్ల ప్రభావితం అవుతుంది. అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయిన ప్రొఫెసర్ ఆచార్య కుమార్తె మాయాను కలుసుకున్న తరువాత పరిస్థితులు విక్కీకి అనుకూలంగా మారిపోతాయి. ఆ సమయంలోనే అతనికి ఓ దిగ్భ్రాంతికరమైన నిజం ఒకటి తెలుస్తుంది.. మాయా మనిషి కాదని.. ‘హ్యూమనాయిడ్ రోబో’ అని, ఆమె కోసం ఓ సైంటిస్ట్ వెతుకుతున్నాడని. ఎన్నో ప్రశ్నలు. అసలీ మార్మిక పాత్రలేంటి.. ఏం చేస్తున్నాయి..?
అమెజాన్ ప్రైమ్ వీడియో నేడిక్కడ రాబోయే తెలుగు రొమాంటిక్ సైన్స్ – ఫిక్షన్ థ్రిల్లర్ బొంబాత్‌కు సంబంధించి కుతూహలం రేకెత్తించే ట్రైలర్‌ను ఆవిష్కరించింది. చౌదరి ఈ సినిమాలో సుశాంత్, చాందిని చౌదరి, సిమ్రాన్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సైన్స్ ఫిక్షన్ ప్లాట్ లో అభిమానులు ఆశిస్తున్న విధంగా చోటు చేసుకున్న రొమాన్స్, యాక్షన్, డ్రామా లపై తొంగిచూసే అవకాశాన్ని ఈ ట్రైలర్ అందిస్తుంది. రాఘవేంద్ర వర్మ దర్శకత్వంలో ఈ సైన్స్ ఫిక్షన్ సుచేత డ్రీమ్ వర్క్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ కింద విశ్వాస్ హనుర్ కర్ నిర్మాణ సారథ్యంలో రూపుదిద్దుకున్న బొంబాట్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిసెంబర్ 3న వరల్డ్ ప్రీమియర్ గా రానుంది.
ఈ సినిమాలో సుశాంత్ చిన్నప్పటి నుంచి దురదృష్టం వెంటాడే విక్కీ పాత్రలో కనిపిస్తారు. విక్కీ జీవితం లోని ఉద్వేగం, నాటకీయత, థ్రిల్ లాంటి వాటిలోకి మనల్ని మరింత లోతుగా తీసుకెళ్తుంది ఈ సినిమా. ఈ సందర్భంగా తన మొదటి సినిమా గురించి దర్శకుడు రాఘవేంద్ర వర్మ మాట్లాడుతూ, ‘‘బొంబాట్ అనేది ఓ చక్కటి ప్రేమకథ, థ్రిల్లింగ్ యాక్షన్, సైన్స్ ఫిక్షన్ అంశాలతో ముడిపడిన ప్లాట్. ఒక అద్భుతమైన స్టోరీ లైన్ ను అందిస్తుంది. ఈ సినిమా వీక్షకుల దృష్టిని ఆకట్టుకుంటుందని మేం భావిస్తున్నాం. సినిమాలో ప్రతీ ఒక్కరి నటనను కూడా వారు ఆనందిస్తారని ఆశిస్తున్నాం’’ అని అన్నారు.
ఈ సినిమా వరల్డ్ ప్రీమియర్ గురించి నిర్మాత విశ్వాస్ హనుర్కర్ మాట్లాడుతూ, ‘‘బొంబాట్ సినిమాను అ మెజాన్ ప్రైమ్ వీడియోపై రిలీజ్ చేయడం మరియు దానితో అనుబంధం కలిగి ఉండడం మాకెంతో ఆనందా న్ని అందిస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో కు గల ప్రజాదరణ, దానికి గల విస్తృతి బొంబాట్ సినిమా ఎంతో మంది వీక్షకులను చేరుకునేందుకు తోడ్పడుతుందని విశ్వసిస్తున్నాం. తన అదృష్టం చిన్న నాటి నుంచే ముఖం చాటేసిందని భావించే విక్కీ చుట్టూరా ఈ సినిమా ఉంటుంది. విక్కీ జీవితంలో ఒక స మయంలో ఏం జరుగుతుందనేదే రోలర్ కోస్టర్ రైడ్. అది వీక్షకులకు వినోదాన్ని అందిస్తుంది. వారి ముఖా లపై నవ్వు లు విరబూసేలా చేస్తుంది’’ అని అన్నారు.
.