పురపాలక ఉద్యోగులకు పాత జీతాలే చెల్లించని వారు విజ్ఞప్తి చేశారు. ఏపీ జేఏసీ పిలుపు మేరకు శ్రీకాళహస్తి పురపాలక సంఘం ఉద్యోగులు శుక్రవారం కమిషనరు బాలాజీనాయక్ కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కొత్త పీఆర్సీ అమలు చేస్తే తమ జీతాల్లో కోత పడుతుందన్నారు.
ప్రభుత్వం ఉద్దేశ్య పూర్వకంగానే ఇలా చేస్తోందని వారు ఆరోపించారు. ఉద్యోగుల సమస్యలు గుర్తించి పాత జీతాలే అమలు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘ అధ్యక్షులు పి.యం.వి. నారాయణ రెడ్డి, ఉపాధ్యక్షులు పి. రవికాంత్, బాల చంద్రయ్య, ట్రెజరర్ హుస్సేన్ అహ్మద్, నాయకులు
సురేష్, శైలజ, లలిత, ప్రేమ్, శ్రీనివాసులు, సాయి సింధు, మేనేజర్ ఉమా మహేశ్వర రావు, స్థానిక పురపాలక సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
.