నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్.ఎస్.ఎస్ యూనిట్, నగరి లయన్స్ క్లబ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్ వేణగోపాల్ మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని విద్యార్థులు విద్యతో పాటు సామాజిక సేవ చేయాలని తెలియజేసారు.
మొత్తం 65 మంది విద్యార్థులు రక్తదానం చేసారు. రక్తదానం చేసినవాళ్ళకి నగరి లయన్స్ క్లబ్ వారు టీ షర్ట్స్ మరియు సర్టిఫికేట్స్ ప్రదానం చేసారు.
ఈ కార్యక్రామంలో నగరి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ గోపాల్, నందకుమార్ మరియు వారి సిబ్బంది, నగరి లయన్స్ క్లబ్ ప్రెపిడెంట్ రామమోహనరావు, సెక్రటరీ మహ్మద్ షఫీ, డైరెక్టర్లు రవిబాబు మంజుల, ప్రభాకర రాజు, నందగోపాల్ పాల్గొన్నారు.
పుత్తూరు లయన్స్ క్లబ్ నుండి దీనబందు, సుబ్రహ్మణ్యం, కళాశాల NSS అధికారి డా.ఈ. గోపి, డా.యం. ధర్మారావు వైస్ ప్రిన్సిపల్ బి సుబ్రహ్మణ్యం, మురళీ మొహన్ రెడ్డి, డా.షర్మిల, డా. యం. అరుణ కుమారి తదితరలు పాల్గొన్నారు.
.