పుత్తూరు పట్టణ కేంద్రమైన ఆదివారం ఉదయం 11 గంటలకు ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ భవన్లో ఏఐటీయూసీ అనుబంధ సంఘమైన బిల్డింగ్ కార్మికుల జిల్లా 9వ మహాసభలు పి హరినాద్ రెడ్డి ప్రారంభించారు.
సభను ఉద్దేశించి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాద్ రెడ్డి, ఏఐటియుసి రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎస్ వెంకట సుబ్బయ్య లు మాట్లాడుతూ ఇసుక ను ఉచితంగా ఇవ్వాలి. ఇసుక మాఫియా ని కట్టడి చెయ్యలి. సిమెంట్, స్టీల్ ధరలను తగ్గించాలని. 2019 జూన్ 21వ తారీకు నుండి నేటికీ బిల్డింగ్ కార్మికులు పనులు లేక తీవ్రమైన ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు
భవన నిర్మాణ కార్మికులకు పెండింగ్ లో ఉన్న క్లైయిమ్స్ ను ఇవ్వాలని. ఇసుక ను ఉచితంగా ఇవ్వాలని. ఇసుక మాఫియా ని కట్టడి చెయ్యాలని. సిమెంట్, స్టీల్ ధరలను తగ్గించాలని. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లాలో భవన నిర్మాణ కార్మికులు 70వేల మంది. రాష్ట్రంలో 20 లక్షల.60 వేల మంది. వరకు సంక్షేమ బోర్డు లో పేర్లు నమోదు కాబడి వున్నారు. భవన నిర్మాణ కార్మికులు గత సంవత్సరం కాలంగా ఇసుక సమస్య వల్ల కరోనా సమస్య వల్ల పనులు లేక ఉపాది కోల్పోయి కుటుంబాలు పూట గడవక దుర్బర జీవితాలను గడుపుతున్నారు అని అన్నారు.
రాష్ట్రంలో ఇసుక మాఫియా ని కట్టడి చెయ్యాలని. డిమాండ్ చేశారు. రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు కుటుంబాలు పూట గడవక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు గా 45 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకొని మరణించడం జరిగిందన్నారు. వారి కుటుంబాలను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2020 మార్చి మాసం నుండి పూర్తిగా లాక్ డౌన్ విధించి 4 నెలల పాటు.2021 మార్చి మాసం నుండి 4 నెలలు లాక్ డౌన్ కారణంగా పనులు లేకుండా పోయినందున భవన నిర్మాణ కార్మికుల జీవన పరిస్థితులు దారుణంగా వున్నాయి అని అన్నారు.
“మూలిగే నక్క పై తాటికాయ పడ్డట్టు “అగమ్యగోచరంగా మారిపోయి. అటు ఇసుక కొరత -ఇటు కరోనా వల్ల ఆర్థికంగా చితికి పోయి భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలను సంక్షేమ బోర్డు ద్వారా ఆదుకొవాలని. రాష్ట్ర ప్రభుత్వాని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో లేబర్ ఆఫీస్ లలో ఖాలీగా వున్న అన్ని రకాల ఉద్యోగాలను భర్తీ చెయ్యాలని. భవన నిర్మాణ కార్మికులకు పెండింగులో ఉన్న క్లెయిమ్స్ అన్ని పరిష్కరించాలని. భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు స్కాలర్ షిప్ లు వెంటనే మంజూరు చెయ్యాలని. భవన నిర్మాణ కార్మికులకు 55 సంవత్సరాలు దాటిన ప్రతి కార్మికుని కి పెన్షన్ ఇవ్వాలని. భవన నిర్మాణ కార్మికులకు పెళ్ళి కానుక ఇవ్వాలని. వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఇసుక మాఫియా ని కట్టడి చెయ్యాలని. ఇసుక ను ఉచితంగా ఇవ్వాలని. సిమెంట్ స్టీల్ ధరలను తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. ఆగస్టు 5 న విజయవాడ లో జరిగే మహ ధర్నా కు భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున తరలి రావాలని కార్మికులకు పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ. జిల్లా ప్రధాన కార్యదర్శి పి మురళి జిల్లా సహాయ కార్యదర్శి జె రామ చంద్రయ్య కోదండం ఎన్ శ్రీరాములు వేణుగోపాల్ రెడ్డి మహేష్ చిరంజీవి విజయ్ చంద్రబాబు శరవణ రమేష్ నవోమి జై కుమారి గోవింద స్వామి తిమ్మయ్య శెట్టి రవి తదితరులు పాల్గొన్నారు
.