జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం (OTS) ఓన్ టైం సెటిల్మెంట్ పై ఎమ్మేల్యే రోజా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
నగరి ఎమ్మేల్యే నివాస కార్యాలయంలో నగరి ప్రజలకు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం గురించి వివరించారు.
ఈ కార్యక్రమం లో మాట్లాడుతూ ..
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని డిసెంబర్ 21న ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభిస్తారని, దీని ద్వారా
51 లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు.
వన్ టైం సెటిల్ మెంట్ చేసుకున్న లబ్ధిదారులందరికీ రిజిస్టర్ టైటిల్ అందుతుందని, గ్రామ, వార్డు సచివాయాల్లోనే రిజిస్ట్రేషన్… రిజిస్ట్రేషన్ రుసుం, స్టాంప్ డ్యూటీ, యూజర్ ఛార్జీలు నూరు శాతం మినహాయింపు వుంటుందని చెప్పారు.
మరియు ఇది పూర్తిగా స్వచ్ఛందంగా వుంటుందని తెలిపారు.
అదే విధంగా గా ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం గురించి వివరించారు.
హౌసింగ్ కార్పోరేషన్ లో దాదాపు 39 లక్షల మంది డాక్యుమెంట్స్ పెట్టి లోన్ తీసుకున్నారు వారిలో గ్రామీణ ప్రాంతంలో వారు 34లక్షల మంది, పట్ణణ ప్రాంతంలో 5లక్షల మంది ఉన్నారు వారికి ఇళ్లు, స్థలాలు అమ్ముకోవాలన్నా అమ్ముకోలేని పరిస్థితి, కనీసం రుణాలు తెచ్చుకోలేని పరిస్థితి ఎటువంటి అధికారం లేదు.
ఈ 39 లక్షల మంది హౌసింగ్ కార్పోరేషన్ కు దాదాపు రూ.14 వేల కోట్ల వరకూ చెల్లించాల్సి ఉంది, 2000 నుంచి 2014 వరకూ వన్ టైం సెటిల్ మెంట్ కింద కేవలం వడ్డీని మాఫీ చేయడం జరిగింది.
కానీ సీఎం జగనన్న పేదలకు వారి ఇంటిపై పూర్తి హక్కు కల్పించేందుకు.. ఈ నిర్ణయం తీసుకున్నారు ఇందులో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి ఇది పూర్తిగా స్వచ్ఛంద పథకం ఎవరికైతే.. ఇంటి పై పూర్తి హక్కులు, డాక్యుమెంట్లు కావలనుకుంటారో వారికి ఇది గొప్ప పథకం అని తెలిపారు.
ప్రతి లబ్ధిదారునికి రిజిస్ట్రేషన్ కోసం, యూజర్ చార్జీల కోసం అయ్యే సుమారు లక్ష రూపాయలు ఆదా అవుతుంది.
పట్టా తీసుకున్న వారు, ఇల్లు కట్టుకున్న వారు.. హౌసింగ్ కార్పొరేషన్ నుంచి రుణాలు తీసుకున్న వారికి గ్రామీణ ప్రాంతంలో రూ.10 వేలు, మునిసిపాలిటీల్లో రూ.15 వేలు, కార్పొరేషన్‌లలో రూ.20వేలు చెల్లిస్తే ఈ పథకం వర్తిస్తుంది లబ్ధిదారులకు ఎంత రుణం ఉన్నా.. వన్ టైం సెటిల్ మెంట్ కింద మిగిలిన రుణం ఎంత ఉన్నా మాఫీ అవుతుంది
వన్ టైం సెటిల్ మెంట్ చేసుకున్న లబ్ధిదారులకు డాక్యుమెంట్స్ రిటర్న్ చేయడంతో పాటు రిజిస్టర్ టైటిల్ ఇస్తాము. అమ్ముకోవాలన్నా, రుణాలు తెచ్చుకోవాలన్నా లబ్ధిదారులకు పూర్తి హక్కులు వస్తాయి.
బ్యాంకుల్లో మార్ట్‌గేజ్ చేసి.. 75 శాతం వరకూ లోన్స్ తీసుకోవచ్చు.. ఇప్పటి వరకు ఈ అవకాశం ఏనాడైనా కలిగిందా..? లబ్ధిదారులు ఆలోచించాలి
డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం ఎలాంటి రిజిస్ట్రేషన్ రుసుం కానీ, స్టాంప్ డ్యూటీ గానీ, యూజర్ ఛార్జీలు గానీ ఉండవు, ఈ పథకం కింద గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచు
పంచాయతీ సెక్రటరీ, వార్డు సెక్రటరీలు రిజిస్ట్రేషన్ అధికారులుగా వ్యవహరిస్తారు. 22 (A) లో ఉన్నవాటిని రిజిస్ట్రేషన్ చేయడం కుదరదు, కానీ ఈ జగనన్న సంపూర్ణ గృహ హక్కు స్కీమ్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నవారికి 22(A) జాబితా నుంచి తొలగించడం జరుగుతుంది ఎటువంటి లింక్ డాక్యుమెంట్స్ లేకుండా భవిష్యత్ లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు
గ్రామ, వార్డు సచివాయాల్లో 10 నిమిషాల్లో ఈ రిజిస్ట్రేషన్ పక్రియ అంతా పూర్తవుతుంది
ప్రభుత్వం ఇచ్చిన ఇంటిపట్టా తీసుకుని.. హౌసింగ్ కార్పోరేషన్ నుండి ఎటువంటి రుణం తీసుకోని వారికి జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద కేవలం రూ.10తో రిజిస్ట్రేషన్ చేసి రిజిస్టర్ డాక్యుమెంట్ ను పొందవచ్చు
దీని ద్వారా లబ్ధిపొందేవారు దాదాపు 12 లక్షల మంది ఉన్నారు.
.