నగరి మండలం లో 2వ విడత నాడు నేడు శిక్షణ కార్యక్రమg క్రింద మంజూరు అయిన 26 పాఠశాలల ప్రధానోపాధ్యాయులు , పేరెంట్స్ కమిటీ చైర్ పర్సన్ మరియు కమిటీ సభ్యులు , సచివాలయ విద్య సహాయకులు , సి ఆర్ పి లకి ఒక్క రోజు శిక్షణ కార్యక్రమము నిర్వహించడం అయినది.
ఈ శిక్షణా కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి పి ఎన్ శ్రీదేవి అద్యక్షత వహించి 2వ విడతలో నాడు నేడు పనులు నాణ్యత పెరగాలని ప్రభుత్వం నిర్ణయించిన తేదీలలో కట్టడాలు ముగించాలని అన్నారు.
పేరెంట్ కమిటీ మెంబర్లు అందరూ కూడా యాక్టీవ్ గా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు . 2వ విడతలో నాడు నేడు చక్కగా పూర్తి చేయాలని కోరారు
ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి వై . ఎస్. జగన్మోహన్ రెడ్డి విద్యార్థులు చదువుతోనే వారి జీవితాలు మారుతాయని చదువు పట్ల ఎక్కువ మక్కువతో ఎక్కువ నిధులు పాఠశాలలకు మంజూరు చేయడం ఆనందదాయకమని కొనియాడారు.
మండలంలో 1వ విడత నాడు నేడు పనులు విజయవంతంగా , నాణ్యత గా పూర్తి అయినాయని , 2వ విడతలో మరింత నాణ్యత పెంచి విద్యార్థులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని కోరడమైనది.
ఈ కార్యక్రమంలో నగరి బాలికల ఉన్నతపాఠశాల హెడ్మాస్టరు వి ఎస్ నమశ్శివాయం మాట్లాడుతూ నాడు నేడు పనులు చేయుట కోసం స్థానికుల సహాయంతో తొందరగా పూర్తి చేయాలని కోరారు.
ఈ శిక్షణా కార్యక్రమానికి పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, పేరెంట్స్ కమిటీ చైర్ పర్సన్ మరియు కమిటీ సభ్యులు , సచివాలయ విద్య సహాయకులు , సి ఆర్ పిలు, కే. కుప్ప రాజు మొదలగు వారు పాల్గొన్నారు.
.