నగరి నియోజకవర్గంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు ప్రభుత్వం తరపున సహాయాన్ని ఎమ్మేల్యే ఆర్కే రోజా అందించారు.
వడమాలపేట మండలం లో పక్క గృహాలు 50 మందికి ఒక్కొక్కరికి 3200 చొప్పున కచ్చా గృహాలు ముగ్గురికి ఒక్కొక్కరికి 5200 చొప్పున అందజేశారు.
పుత్తూరు మండలం లో కచ్చా గృహాలు 12 మందికి 3,200 రూపాయలు చొప్పున, గుడిసెలు 23 మందికి 4100 రూపాయల చొప్పున అందజేశారు.
నగరి మండలం లో గుడిసె గృహాలకు 55 మందికి ఒక్కొక్కరికి 4100 చొప్పున, కచ్చా గృహాలు 13 మందికి రూ.3200 చొప్పున మొత్తం 68 మందికి అందజేశారు.
నిండ్ర మండలం లో మొత్తం 30 మంది గుడిసె గృహాలకు ఒక్కొక్కరికి 4100 చొప్పున, విజయపురం మండలం లో 26 మంది గుడిసె గృహాలకు ఒక్కరికి 4100 రూపాయలు చొప్పున 3 పక్కా గృహాలకు ఒక్కొక్కరికి 5200 రూపాయల చొప్పున నగదు సహాయాన్ని అందించడం జరిగింది.
మొత్తం 215 గృహాలకు రూపాయలు 8,20,600 అక్షరాలా ఎనిమిది లక్షల ఇరవై వేళ ఆరు వందల రూపాయలను తక్షణ సహాయం కింద ప్రభుత్వ సహాయాన్ని అందించారు
.