నందమూరి కుటుంబంలో మూడోతరం హీరో నందమూరి తారక రత్న కన్నుమూశారు. ఆయన వయస్సు 39 సంవత్సరాలు. ఆయనకు భార్య పిల్లలు ఉన్నారు.
బెంగుళూరు నారాయణ హృదయాలయలో ఇరవై రోజులుగా చికిత్స పొందుతున్న తారకత్న.. శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.
తారకరత్న కన్నుమూతతో తెలుగు చిత్ర పరిశ్రమలోను, తెలుగుదేశం వర్గాల్లోనూ తీవ్ర విషాదం నెలకొంది. పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం వెలిబుచ్చుతున్నారు.
.