విశాఖను మరో ప్రకృతి విపత్తు పలకరించింది. పెను ప్రాణనష్టం ఏమీ లేకపోయినా.. ఇది మాత్రం ప్రమాదకర సంకేతమే. సముద్రం ముందుకొచ్చింది! ఆర్కే బీచ్ ప్రమాదకరంగా తయారైంది. ముందుకొచ్చిన సముద్రం కొంత బీభత్సాన్నీ సృష్టించింది.
బంగాళాఖాతం సముద్రం ముందుకు రావడంతో ఆర్కే బీచ్ నుంచి దుర్గాలమ్మ గుడి వరకు సుమారు 200 మీటర్ల మేర భూమి కోతకు గురైంది. నొవాటెల్ ఎదురు గా ఉన్న చిల్డ్రన్‌పార్కులో ఒక ప్రహరీ గోడ కూలిపోయింది.
పరిస్థితి ప్రమాదకరంగా కనిపించడంతో ఆర్కేబీచ్ లోకి పర్యాటకులకు ప్రవేశం నిషేధించారు.
సముద్రం ముందుకు రావడంతో ఆ ప్రాంతంలో పలుచోట్ల భూమి కుంగిపోయి పగుళ్లు ఏర్పడ్డాయి. ఆర్కే బీచ్ వద్దకు పర్యాటకులకు అనుమతి నిషేధిస్తూ అధికారులు ఆదేశం. సందర్శకులు అక్కడికి రాకుండా అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.
జవాద్ తుపాను నేపథ్యంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతోనే సముద్రం ముందుకొచ్చి ఉంటుందని అధికారుల అంచనా.
సముద్రం ముందుకు రావడం కొత్త విషయం కాదు గానీ.. సుమారు 200 వందల మీటర్ల మేర తీరంలోని భూమి కోతకు గురికావడం, భూమి పగుళ్లుబారడం.. ప్రహరీ సైతం కూలిపోవడం వంటి సంకేతాలే.. తీవ్రమైనవిగా ప్రజలను భయపెడుతున్నాయి. అధికారులు పటిష్ట భద్రత చర్యలు చేపడుతున్నారు.
.