హైదరాబాద్: సెప్టెంబర్ 20, 2022: ప్రపంచంలోని అగ్రశ్రేణి గేమింగ్ మరియు ఈస్పోర్ట్స్ కంపెనీలలో ఒకటైన నోడ్విన్ గేమింగ్ ఇప్పుడు సరికొత్త హంగులతో హైదరాబాద్ లోకి డ్రీమ్‌హాక్ తో అడుగుపెట్టనుంది. నవంబర్ 4వ తేదీ నుండి 6వ తేదీ వరకు ఈ ఎడిషన్ కొనసాగనుంది. హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లోని హాల్ 1 మరియు 3లో ఈ ఎడిషన్ జరగనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
భారతదేశ గేమింగ్ పరిశ్రమ వేగవంతంగా అభివృద్ధి చెందుతుంది. ఫుట్‌ఫాల్‌తో, డ్రీమ్‌హాక్ భారతదేశం నుండి గేమింగ్ ఔత్సాహికుల సమూహాన్ని ఒకే పైకప్పు క్రిందకు తీసుకురానుంది. సరికొత్త హంగులతో రూపుదిద్దుకున్న ఈ ఎడిషన్ చూపరులను ఆకట్టుకోనుంది. ఇందుకు తగ్గుట్టుగా నవంబర్ 4 ప్రారంభ వేడుకలలో గేమింగ్ అభిమానులను, గేమింగ్‌లో ఇప్పటి వరకు అద్భుతమైన ఫలితాలు సాధించి వారి అనుభవాలను పంచుకోవడానికి ఇది ఒక వేదికగా మారనుంది. దీనితో పాటు గేమింగ్‌కి తగట్టు సౌండ్ సిస్టం, లైటింగ్‌లతో చూపరులను ఆకట్టుకునేలా సిద్దం చేస్తున్నారు.
“తెలంగాణలో ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ఫెస్టివల్‌ని తొలిసారిగా నిర్వహించడం పట్ల మేము సంతోషిస్తున్నాము. కొత్త అనుభవాల కోసం ఎల్లప్పుడూ వెతుకుతూ ఉండే యువ టెక్ అవగాహన ఉన్న ప్రేక్షకులందరికీ హైటెక్ సిటీ ఒక ప్రధాన ప్రదేశం. డ్రీమ్‌హాక్ అనేది డిజిటల్ ప్రతిదానికి పర్యాయపదంగా ఉంటుంది. తెలంగాణ ప్రజలకు ఆహ్లాదకరమైన మరియు వినోదాత్మకమైన వారాంతాన్ని అందించడానికి” అని తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమలు & వాణిజ్యం (I&C) మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ జయేష్ రంజన్ అన్నారు.
“ఈ డ్రీమ్‌హాక్ అనేది కేవలం గేమింగ్ ఈవెంట్ మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ కలిసి రావడం, సరదాగా గడపడం, పాత స్నేహితులను కలవడం, వారు ఆరాధించే గేమ్‌లు ఆడడం మరియు స్పోర్ట్స్‌లో యుద్ధాలను తలపించే గేమ్‌లను చూడటం వంటి పండుగ! మునుపెన్నడూ లేని విధంగా డ్రీమ్‌హ్యాక్‌ను అనుభవించాలని ఎదురుచూస్తోంది మరియు హైదరాబాద్‌లోని ఈ 3వ ఎడిషన్ కూడా అదే విధంగా చేస్తామని హామీ ఇచ్చింది. ఇది 3 రోజుల పాటు అంతులేని వినోదంగా ఉంటుందని – నోడ్విన్ గేమింగ్ సహ-వ్యవస్థాపకుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్ అక్షత్ రాథీ తెలిపారు.”
గేమింగ్, మ్యూజిక్ మరియు కల్చర్, లైవ్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్, సరికొత్త లాంచ్‌లు మరియు టెక్ డెమోలతో పాటు ఈస్పోర్ట్స, రెట్రో గేమింగ్, టేబుల్‌టాప్ గేమింగ్ మరియు మరిన్నింటికి సంబంధించిన అతిపెద్ద చిహ్నాలతో సమావేశానికి వేధిక ఇది.
ఇందులో పాల్గొనే అభిమానులు ఇన్‌సైడర్, బుక్ మై షో మరియు మేరా ఈవెంట్‌ల ద్వారా టికెట్లను పొందవచ్చు. ఈ ఎడిషన్‌లో పాల్గొనడానికి ఇప్పటికే డ్రీమ్‌హాక్ ఆన్‌లైన్ టికెట్ల విక్రయాలు ప్రారంభించారు. తమతో టికెట్ల విషయంలో భాగస్వాములైన బుక్‌మై షో, పేటిఎం మరియు మేరా ఈవెంట్ లింకులు అందుబాటులో ఉన్నాయి.
.

Discussion about this post