నవంబరు నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను అక్టోబరు 21న శుక్రవారం ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
అదేవిధంగా, డిసెంబరు నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల కోటాను అక్టోబరు 21న శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
కాగా, డిసెంబరు నెలకు సంబంధించిన మరికొన్ని ఆర్జిత సేవలను ఆన్‌లైన్ లక్కీడిప్ లో అక్టోబరు 22న ఉదయం 10 గంటల నుండి అందుబాటులో ఉంచుతారు.
భక్తులు ఈ విషయాలను గుర్తించి బుక్ చేసుకోవాలని కోరడమైనది.
.