తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండలంలోని కల్లివెట్టు ఉన్నత పాఠశాలలో గ్రామ నివాసి,పాఠశాల పూర్వ విద్యార్ధి ఉద్యోగ రీత్యా దుబాయ్ దేశంలో ఉన్న నెల్లూరు రమేష్ రెడ్డి, సుధీర దంపతులు 5 లక్షల రూపాయలతో సరస్వతి దేవి ఆలయం నిర్మించి బుధవారం విగ్రహ ప్రతిష్ట చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టిన గ్రామానికి, చదువుకున్న పాఠశాలకు సేవ చేయాలనే సంకల్పంతో పాఠశాలలో విద్యార్థులకు విజ్ఞానాన్ని పంచే జ్ఞానంతో పాటు విలువలు నేర్చుకోవాలన్నారు. జన్మనిచ్చిన తల్లి దండ్రులను పూజించాలన్నారు. మా ఊరి పాఠశాలకు ఏదోఒకటి చేయాలనే ఉద్దేశంతో ఈ సరస్వతీ దేవి ఆలయం నిర్మించడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు.
రమేష్ రెడ్డి తల్లిదండ్రులు సప్తగిరి గ్రామీణ బ్యాంకు విశ్రాంత మేనేజర్ సుందర్ రెడ్డి, శ్రీమతి రాజేశ్వరి, విశ్రాంత ఉపాధ్యాయులు హరి గోపాల్ రెడ్డి,సీనియర్ పాత్రికేయులు , కథా రచయిత మునిసురేష్ పిళ్ళై, లక్ష్మీ ప్రసాద్,పాఠశాల ప్రధానోపాధ్యాయులు రూపేష్ కుమార్, ఉపాధ్యాయులు యువశ్రీ మురళి, నాదెండ్ల మురళి, ఒబ్బుదేవి ప్రసాద్, సురేష్ బాబు, వేణుగోపాల్, లక్ష్మయ్య, దేవేంద్ర, దాసు , మాధవీలత, జగన్నాధం, దీపిక,రామదాసు, శివకుమార్,గిరిధర్ రెడ్డి,ధనంజయులు రెడ్డి, మధురెడ్డి, సర్పంచ్ రాగమ్మ తిరుపాలయ్య తదితరులు పాల్గొన్నారు.
Discussion about this post