• About Us
  • Contact Us
  • Our Team
Friday, July 31, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

లోపలిమాట : నేను స్వేచ్ఛాజీవినా..? కాదా…?

మనం స్వేచ్ఛగా బతుకుతున్నామా? మనం వ్యవహారసరళితో అసలైన స్వేచ్ఛకు సంకెళ్లు బిగించుకుని.. ఆత్మవంచనతో బతుకుతున్నామా.. దేవీప్రసాద్ ఒబ్బు.. ఆలోచనాత్మక విశ్లేషణ

admin by admin
March 17, 2021
0
లోపలిమాట : నేను స్వేచ్ఛాజీవినా..? కాదా…?

ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఉండాలనే కోరుకుంటారు. కానీ ఉండటానికి ఎవరూ సాహసించరు. ఎందుకంటే స్వేచ్ఛ కావాలంటే మనం చేసే పని పట్ల బాధ్యత కూడా వహించాల్సి ఉంటుంది. కానీ బాధ్యతగా ఉండటానికి ఎవరూ ఇష్టపడరు. అందుకే లోకంలో మానవ హక్కుల సంఘాలున్నాయేగాని మానవ బాధ్యత సంఘాలు లేవు. బాధ్యతను ఇతరులపైకి నెట్టేస్తూ ఉంటాం. అందువల్ల స్వేచ్ఛ అనేది మనకు ఆమడ దూరంలో ఉండిపోయింది.

అసలు స్వేచ్ఛ అంటే ఏమిటి..?

మన మనస్సుకు నచ్చినట్లు ఉండటానికి మనలోని భావాలను, కోరికలను, ఆశలను, ఆకాంక్షలను ధైర్యంగా చెప్పగలగడమే స్వేచ్ఛ.

మరి అలాంటి స్వేచ్ఛ మనకుందా…?

లేదనే చెప్పాలి. ఎందుకంటే అందుకు చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యం లేకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి.

ఉదాహరణకు:

నేను ఐదవతరగతి చదివేటప్పుడు క్లాసులో ఉపాధ్యాయుడు పాఠం చెప్పేటప్పుడు పక్కవాడితో మాట్లాడానని కోపంతో పైకి లేపి నా రెండూ అరచేతులపైన బెత్తంతో ఐదేసి దెబ్బలు కొట్టి కూర్చోబెట్టాడు. నేను కూర్చున్న పదినిమిషాల తర్వాత క్లాసులోకి మరో ఉపాధ్యాయుడు వచ్చి మాకు బోధించే ఉపాధ్యాయుడితో ఐదు నిమిషాలు మాట్లాడేసి వెళ్ళిపోయాడు. అప్పుడు.. “సార్ నేను వీడితో మాట్లాడితే కొట్టారు. మరి మీరు ఆ సారుతో మాట్లాడారు కదా. మిమ్మల్ని ఎవరు కొడతారు” అని అడగాలనిపించింది మనస్సులో. కానీ అడిగే ధైర్యం లేదు. ఎందుకంటే నేను చిన్నపిల్లవాణ్ణి. ఒకవేళ నేను ధైర్యం చేసి అడిగి ఉంటే.. నన్ను మళ్ళీ దండించి.. టి.సి ఇచ్చి ఆ స్కూలు నుంచి పంపించేసేవారు.

ఈ సందర్భంలో నేను, ఉపాధ్యాయుడు చేసింది ఒకే తప్పు అయినప్పటికీ ఒకరికి శిక్ష పడింది. మరొకరికి శిక్ష పడలేదు. అంటే నాకు తెలియకుండానే  “భయం” అనే బీజం నా మనోఫలకంలో నిక్షిప్తమైపోయింది. తద్వారా ఆ భయం భవిష్యత్తు కాలంలో నా తల్లిదండ్రుల దగ్గర, సమాజంలో మనుషుల మధ్య నా భావాలను వ్యక్తపరచడానికి అవకాశం లేకపోవడంచేత నేను బానిసగా మారడంతో నాకు స్వేచ్ఛ కరువైంది.

deviprasad obbu columnistఇంకొక ఉదాహరణ:

నేటి సమాజంలో.. నా పరిధిలో నేను గమనించిన మేరకు నాకు అవగాహనకు వచ్చిన అంశం ఏంటంటే… చాలామంది అసంతృప్తితో బతుకు బండిని భారంగా లాక్కొస్తున్నారని అర్థమయింది. దానికి కారణం వారికి స్వేచ్ఛ లేకపోవడమేనని నా అభిప్రాయం. ముఖ్యంగా భార్యాభర్తలలో నూటికి తొంభై శాతం మంది నిరాసక్తితో జీవితాన్ని గడుపుతున్నారు. కానీ ఎవరూ బయటకు చెప్పరు. అన్యోన్యంగానే ఉన్నట్లు నటిస్తారు. అందుకు కారణం వాళ్ళ అంతరాలలో ఎన్నో ఏళ్ళ నుంచి పేరుకుపోయిన భయమే అనేది అక్షరసత్యం. అసలు ఈ భయం రావడానికి కారణం వాళ్ళు ఒకరికి తెలియకుండా మరొకరు కొన్ని విషయాలను రహస్యంగా ఉంచడమే.

రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏమొచ్చిందని మనకు అనుమానం రావచ్చు. దానికీ అనేక కారణాలు ఉన్నాయి. ఒక కుటుంబంలో భార్యకి తరచూ ఫోన్లో తన స్నేహితులతో చాటింగ్ చేయడం ఇష్టం. కానీ అలా చాటింగ్ చేయడం భర్తకు ఇష్టం ఉండదు. అందువల్ల భర్త ఇంట్లో ఉన్న సమయంలో ఆ పని చేయదు. భర్త ఆఫీసుకు వెళ్ళిన తర్వాత తనకు ఇష్టమొచ్చినట్లు తన స్నేహితులతో మాట్లాడుతూ, చాటింగ్ చేస్తూ సంతోషంగా గడుపుతుంది. కానీ ఆ విషయం తన భర్తకు ఎక్కడ తెలుస్తుందోనని మనస్సులో భయపడుతూ ఉంటుంది. ఆ రకంగా ఆమె స్వేచ్ఛను కోల్పోయింది.

అదేవిధంగా ఒక కుటుంబంలో భర్తకు సినిమాలకు, షికార్లకు భార్యతో వెళ్ళడం ఇష్టం. కానీ భార్యకు అలా తిరగడం ఇష్టం ఉండదు. అందువల్ల భార్యకు తెలియకుండా తన స్నేహితులతో కలసి సినిమాలకు, షికార్లకు వెళ్ళడం అతను అలవాటు చేసుకుంటాడు. కానీ ఈ విషయం తన భార్యకు ఎక్కడ తెలుస్తుందోనని తరచూ భయపడుతూ ఉంటాడు. ఆ రకంగా అతను స్వేచ్ఛను కోల్పోయాడు. జైలుగదిలో ఉన్న ఖైదీని అప్పుడప్పుడు జైలుగది నుంచి బయటకు తీసుకువచ్చి జైలు ఆవరణలోకి వదులుతుంటారు. అలా వదలడమే ఆ ఖైదీ స్వేచ్ఛ అనుకుంటాడు. ఇప్పుడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ కూడా అలాంటిదే.

చిన్న పరిమితి నుండి, పెద్ద పరిమితికి మారటమే స్వేచ్ఛ అనుకుంటాడు…నిజానికి రెండూ పరిమితులే.

మరి స్వేచ్ఛగా ఉండాలంటే… ఏం చెయ్యాలి?

ఇంతకు మునుపు చెప్పినట్లు మనలోని భావాలను, ఆశలను, ఆకాంక్షలను నిర్భయంగా, దాపరికం లేకుండా చెప్పగలిగినప్పుడే, అనగా పారదర్శకత (transparent) గా ఉండగలిగినప్పుడే  స్వేచ్ఛ అనేది సాధ్యపడుతుంది. అలా మన భావాలను నిర్భయంగా చెప్పినప్పుడు ఆటంకాలు ఎదురౌతాయని ఇంతకు మునుపు మీరు ప్రస్తావించారుకదా అని మీరు నన్ను అడగవచ్చు. అక్కడే ఉంది కీలకం. మనం ఏదైనా పనిచేసే ముందు ఆ పని మంచిదా? చెడ్డదా? అనే విషయాన్ని మన మనస్సు ఖచ్చితంగా హెచ్చరిస్తుంది. కానీ మనం మనస్సు మాట వినకుండా చెడ్డదైనా చేసేస్తాం. ఆ తర్వాత ఎందుకు చేసామా అని బాధ పడుతాం. అది బాధకాదు భయం. ఆ భయమే మనకు స్వేచ్ఛ లేకుండా చేస్తుంది.

కాబట్టి స్వేచ్ఛ కోరుకునేవారు ఖచ్చితంగా దాపరికాన్ని అంతమొందించాల్సిందే. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య దాపరికం అనేది అసలు ఉండకూడదు. అప్పుడే వారి దాంపత్య జీవితం స్వేచ్ఛాయుత వాతావరణంలో విరాజిల్లుతుంది.

మరి మనం అలాంటి స్వేచ్ఛాయుత జీవితాన్ని అనుభవిస్తున్నామా? లేదా? అనేది ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకొని నిర్థారించుకోవాలే తప్ప దానికి వేరే కొలమానాలు లేవు.

…దేవీప్రసాద్ ఒబ్బు
98662 51159

Tags: deviprasad obbufree livingfreedom of livinglopalimataobbu devi prasad
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

28 జూన్ 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

28.6.26 ‘కథానిధి’ సమీక్ష: వర్తమాన సామాజిక వాస్తవికత

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply