• About Us
  • Contact Us
  • Our Team
Tuesday, September 15, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

లోపలిమాట: బంధాలు బలపడాలంటే..

admin by admin
December 13, 2021
0
లోపలిమాట: బంధాలు బలపడాలంటే..

సృష్టిలో ఏ జీవి అయినా హాయిగా, సుఖంగా, సంతోషంగా జీవితాన్ని గడపడానికి సాటి జీవులతో కలిసి మెలిసి మనుగడ సాగించాలి. తోటివారితో సాంగత్యం, సహకారం.. తోడ్పాటు, ఆదరణ, ఆత్మీయ పలకరింపు అవసరం.

ఈ లక్షణాలు ఇతర జీవరాశులలో నాటినుండి నేటివరకు పదిలంగా, పుష్కలంగా మనకు కనిపిస్తూనే వున్నాయి.  అందుకే కాబోలు అవి మనం గొప్పగా భావించే నాగరికత యొక్క స్పర్శ లేకుండా ఇప్పటికీ స్వేచ్ఛగా, హాయిగా, సుఖవంతమైన జీవితాన్ని గడుపుతున్నాయి.

కానీ, ఎందుకో ఈ లక్షణాలు ఈ నాగరికత అనే జబ్బు వలన మనిషిలో కాస్త కొరవడ్డాయి. అందుచేతనేమో మనుషుల జీవితాలలో నిర్లక్ష్యం, నిరాశక్తత, అసహనం, అసంతృప్తి లాంటి అవలక్షణాలు చోటుచేసుకుంటున్నాయి. ఆ అవలక్షణాల కారణంగానే మనుషుల మధ్య బంధాలు బలహీనపడుతున్నాయి.

నిజంగా నాగరికత అభివృద్ధి అంటే –
సుఖశాంతులతో ఇంకా మెరుగైన జీవితాన్ని గడపగలిగే అవకాశాలు మెరుగవ్వడం.

మరి మనిషికి ఈ దుస్థితి దాపురించడానికి ప్రధాన కారణం ఆధునిక పరికరాలైన సెల్ ఫోను, టెలివిజన్, అంతర్జాల వినియోగమేనని చాలామంది వాపోతుంటారు. ఇందులో కొంత నిజం ఉండొచ్చేమో కాని పూర్తిగా నిందను వాటిపైకి తోసెయ్యడానికి వీలులేదు.

ఎందుకంటే..
సైన్సు ఎంత అభివృద్ధి చెందినా, ఎన్ని ఆధునిక పరికరాలు వచ్చినా వాటి వినియోగ పరిమితి మనిషికి లోబడే ఉంటాయి.

అంటే..
సాంకేతికతను, ఆధునిక పరికరాలను మన అవసరం మేరకు ఉపయోగించుకోవాలి. నిజానికి వాటిని సక్రమంగా ఉపయోగించుకుంటే చాలా లాభాలే ఉన్నాయి. మనకు ఏ విషయానికి సంబంధించిన సమాచారమైన గూగుల్లో దొరుకుతుంది. అంతేకాదు సృజనాత్మకతను పెంపొందించే యాప్స్ నేడు చాలానే అందుబాటులో ఉన్నాయి. అలాంటి వాటిని ఉపయోగించుకుంటే మనలో నైపుణ్యత మెరుగుపడుతుంది.

కానీ, మనలో కొంతమంది ఆ దిశగా ఆలోచించకుండా అనవసరమైన, అసందర్భమైన, అసహ్యకరమైన విషయాలపట్ల ఆకర్షితులై కాలాన్ని వృధా చేసుకుంటూ మనుషులతో మసలుకోవడం మరచిపోతున్నారు.

ఎలాగంటే..
ఉదాహరణకు: మన ఆప్తులలో ఎవరికైనా పుట్టినరోజో లేకపోతే పెళ్ళిరోజో అనుకోండి. ఆ విషయం మనకు తెలిసినా ఆ వ్యక్తితో నేరుగా మాట్లాడం. వాట్సప్ లో మెసేజ్ పెట్టేసి చేతులు దులిపేసుకుంటున్నాం. ఒకవేళ ఆ సదరు వ్యక్తి మనం ఉండే వాట్సప్ గ్రూపులో ఉన్నారనుకోండి. అప్పుడు కూడా వెంటనే మెసేజ్ పెట్టం. ఎవరైనా మెసేజ్ పెడితే తర్వాత పెడతాంలే అని తాత్సారం చేస్తాం. ఒకవేళ ఎవరైనా పెట్టారనుకోండి..

దాన్నే పేస్ట్ చేసో, ఫార్వార్డ్ చేసో అతనిపైకి వదిలేస్తాం.

ఇది ఎంత దారుణమో చూడండి..!

మన మిత్రులకోసం, ఆప్తులకోసం రోజులోని  ఇరవై నాలుగు గంటలలో ఒక రెండు నిమిషాలు కేటాయించలేమా..?

నేరుగా మాట్లాడకపోయినా పర్వాలేదు. అతనితో నీకున్న అనుబంధం, జ్ఞాపకాలను వాట్సప్ లో రెండు మూడు మాటలతో తెలియజేస్తే అతను ఎంతో సంతోషిస్తాడు కదా..!

కానీ, కొంతమంది అట్లా ఆలోచించడంలేదు.

‘ఆ సమయాన్ని కూడా అతనికి ఎందుకు వినియోగించాలి?’ అని దుర్మార్గంగా ఆలోచిస్తున్నారు. ఎంత విచిత్రమో చూడండి..! అంతేకాదు ఆ సమయాన్ని  ఫేస్ బుక్ లోనో, యూట్యూబ్ లోనో అనవసరమైన విషయాలను చూడడానికి కేటాయిస్తున్నారు.

అంతేకాకుండా ఆ చెత్తను ఎప్పడుపడితే అప్పుడు వాట్సప్ గ్రూపుల్లోకి ఫార్వార్డ్ చేసేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు.

EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి

మరి ఇలాంటి పరిస్థితులలో బంధాలు ఎలా బలపడుతాయి? మీరే ఆలోచించండి.
ఇది ఎవరిమీదోనో అసంతృప్తో, ఆక్రోశమో కాదు. ప్రస్తుతపరిస్థితిని చెప్పడం  మాత్రమే.

కాబట్టి.. మనుషులమైన మనం కాస్త విచక్షణ, విజ్ఞతతో ఆలోచించి ఓ ఇరవై యేళ్ల క్రితం ఇవేవీ లేనప్పుడు మన స్నేహితులతో ఎలా గడిపేవాళ్లమో గుర్తుకు తెచ్చుకోండి. సాటి మనుషులకోసం, మన ఆత్మీయుల కోసం కాస్త సమయాన్ని కేటాయించి వారితో ఆప్యాయంగా, ఆత్మీయతో పలకరిస్తూ ఉంటే బంధాలు చక్కగా, చిక్కగా పదికాలాల పాటు పదిలంగా ఉంటాయి.

ఇదే నాగరికత అభివృద్ధి అంటే.. అంతేగాని, నాగరికత అభివృద్ధి అంటే- ఊరిని మిద్దెలు మేడలతో నింపేయడం కాదు. ఆధునిక వస్తువులతో ఇంటిని నింపేయడం కాదు. అనవసర విషయాలతో వొంటిని నింపేయడం అంతకన్నా కాదు.

..దేవీప్రసాద్ ఒబ్బు
9866251159

Tags: deviprasad obbufriendshiplopali matao prasadobbu deviprasadobbu prasadrelationsఒబ్బు దేవీప్రసాద్దేవీప్రసాద్ ఒబ్బుప్రసాద్ లోపలిమాటలోపలి మాట
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

‘యుద్ధాలు బలికోరేది మానవత్వాన్నేనా?’

23 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

సురేష్ పిళ్లె: ఘనీభవన స్థితి ‘కడెవర్ భారతి’

చాగంటి ప్రసాద్: యతో కృష్ణ స్తతో జయః

16 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

9.8.26 కథానిధి సమీక్ష: అక్షరాలే అసలైన కాపలాదారులు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply