తల్లిని బెదిరించ బోయి ప్రమాదవ శాత్తూ బిల్డింగ్ పై నుంచి పడి యువకుడు మృతి చెందాడు. విశాఖ నగర పరిధిలో గల మారికవలస రాజీవ్ గృహకల్ప కాలనీలో సోమవారం తెల్లవారు జామున ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అయితే వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.
సాయిప్రకాష్(23) అనే యువకుడు ఫ్రెండ్ బర్త్ డే పార్టీ సందర్భంగా భోజనానికి అలస్యంగా వచ్చాడు. మిత్రులు అందరూ కలిసి రోడ్ మీద కేక్ కటింగ్ పెట్టుకున్నారు. భోజనానికి అలస్యం అవుతుండటంతో తల్లి మందలించింది.
మరో సారి నువ్వు పిలిస్తే ఆత్మహత్య చెసుకుంటానని సాయికిరణ్ బెదిరించాడు. తల్లిని బెదిరించే క్రమంలో మేడపై నుంచి ప్రమాదవ శాత్తూ జారి పడి అక్కడి కక్కడే మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబంలో, మిత్రుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
.