• About Us
  • Contact Us
  • Our Team
Thursday, September 17, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

డిప్రెషన్‌ని ఇలా ఈజీగా జయించొచ్చు!

admin by admin
October 10, 2021
0
డిప్రెషన్‌ని ఇలా ఈజీగా జయించొచ్చు!

మనలో చాలామంది తాము విపరీతమైన వేదనకు గురవుతున్నామని భావిస్తుంటారు. అంతేకాదు… తాము ఇలా నిరాశలో కూరుకుపోతూ… దానిలోనుండి బయటికి రాలేక చివరికి ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనుకాడరు. ఇంతకీ అసలు వేదన ఎందుకు? దిగులెందుకు?

మనం మామూలుగా చెప్పుకోవాలంటే ఈ దిగులునే డిప్రెషన్ అంటుంటాం. అయితే ఇది ఎందుకు వస్తుంది? ఇది వస్తే అసలు దీనికి పరిష్కారం లేదా? చావాల్సిందేనా? అనుకుంటే తప్పే. ఎందుకంటే మనచుట్టూ శతకోటి సమస్యలు ఉంటే వాటికి అనంతకోటి పరిష్కారాలు కూడా ఉంటుంటాయ్. కానీ వాటి గురించి మనకు తెలియదు. ఎవరైనా తెలియజెప్పినాకూడా అందునా డిప్రెషన్ మూడ్ లో ఉన్నవారికి అసలు ఎక్కదు.

అసలు డిప్రెషన్ ఎందుకు వస్తుంది…? అంటే కారణాలు ఏవైనా కావచ్చుగాక… డిప్రెషన్ కు గురైనవారు తాము బాధపడుతూ… తమ చుట్టూ ఉండేవారిని కూడా మరింత వేదనకు గురిచేస్తుంటారు. దీనివల్ల వారికన్నా వారిపై ప్రేమచూపే వారి కుటుంబ సభ్యులు మరింతగా కుంగిపోతుంటారు. అందుకే ఇలా డిప్రెషన్ కు గురైనవారు దాని లక్షణాలను గుర్తించి, దానినుండి బయటపడడానికి ప్రయత్నించాలి.

ఏదైనా మొగ్గగా ఉన్న సమయంలోనే వంచాలి. అది మొక్కైనా, రోగమైనా. డిప్రెషన్ అనేదికూడా మనకు ఆరంభ దశలోనే గుర్తించి, జాగ్రత్తపడితే ఆ మూడ్ నుండి సులభంగా బయటపడవచ్చు అంటున్నారు పరిశోధకులు. దీనికి కొన్ని అంశాలు సహకరిస్తాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగినది వ్యాయామం.

మన రోజువారీ దైనందిన జీవితంలో వ్యాయామానికి పెద్ద పీట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. రోజూ ఒక అరగంటపాటు వ్యాయామం చేయడం వల్ల మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన శరీరంలో మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే ఎండార్ఫిన్స్ బాగా ఉత్పత్తి అవుతాయి. ఇవి మన డిప్రెషన్ ను తగ్గిస్తాయని చెప్పవచ్చు.

అలాగే లైట్ డిప్రెషన్ కు గురైనవారు చీకటిలో ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు. నిజానికి చీకటి అనేది మనలో అనేక రకాలైన చెడు ఆలోచనలను కలుగచేయడానికి అవకాశం కల్పిస్తుంది. అందుకే చీకటిలో ఉండేకన్నా డిప్రెషన్ కు గురైనవారు చక్కటి వెలుతురులో ఉంటే వారి మూడ్ మారే అవకాశం ఉంది. అయితే ఇది ఏ రెడ్ కలరో వేరే మరేదో కలరో కాకుండా తెల్లటి స్వచ్ఛమైన కాంతిలో ఉంటే మరింత మంచిదని చెప్పవచ్చు.

డిప్రెషన్ కు గురైనవారు తరచూ తమ డాక్టరు సలహాలను పాటిస్తూ ఇలాంటి చిన్న మార్పులను తమ జీవితంలో చేసుకోవడంతోబాటు మందు తాగడాన్ని కూడా దూరం చేసుకోవాలి. మద్యం తాగేవారు, అలాగే మాదక ద్రవ్యాలను తీసుకునేవారు ఎక్కువగా ఇలాంటి డిప్రెషన్ మూడ్ లోకి వెళ్లే ప్రమాదం ఉంది. అలాంటి వారు వాటికి దూరంగా ఉంటూ చిన్న చిన్న నియమాలను పాటిస్తూ, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతూ ఉంటే చక్కగా డిప్రెషన్‌ను జయించవచ్చు.

Tags: have good healthhealth is wealthhealth ruleshealth tipskeep depression awayovercome depressionఆరోగ్య రహస్యాలుఆరోగ్య సలహాలుఆరోగ్యమే మహా భాగ్యండిప్రెషన్ జయించండిమీ ఆరోగ్యం మీ చేతుల్లో
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

‘యుద్ధాలు బలికోరేది మానవత్వాన్నేనా?’

23 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

చాగంటి ప్రసాద్: యతో కృష్ణ స్తతో జయః

సురేష్ పిళ్లె: ఘనీభవన స్థితి ‘కడెవర్ భారతి’

16 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

30.8.26 కథానిధి సమీక్ష: మనిషిని వెతుకుతున్న కథలు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply