శ్రీకాళహస్తి మండలం ముచ్చివోలులో గురువారం జనసేనాని పవన్ కల్యాణ్ కు రైతులు, జనసేన నేతలు పాలాభిషేకం చేశారు. అప్పుల ఊబిలో కూరుకు పోయి ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.లక్ష వంతున ఆర్థిక సాయం చేస్తామని జనసేనాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముచ్చివోలులో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నేతలు మాట్లాడుతూ… ప్రభుత్వాలు ఎన్ని మారినా రైతు బతుకు మారడం లేదన్నారు. పవన్ కల్యాణ్ రైతులకు అండగా నిలవడం అభినందనీయమన్నారు. జనసేన అధికారంలోకి వస్తే రైతుల బతుకు మారుస్తారన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గం ఇన్ ఛార్జి వినుత కోటా, శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, నాయకులు గణేష్, హరి యాదవ్, లక్ష్మణ్ యాదవ్, వెంకటరామయ్య, జనసైనికులు పాల్గొన్నారు. కాగా పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి టీడీపీ మాజీ సర్పంచ్ దద్దోలు రమణయ్య జనసేన పార్టీలో చేరారు. వినుత జనసేన కండువా వేసి రమణయ్యను పార్టీలోకి ఆహ్వానించారు.
.