జనసేనాని పవన్ కళ్యాణ్ వారణాశిలో మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం సతీసమేతంగా కాశీ విశ్వనాధుని ఆలయానికి వెళ్లి పూజలు, అభిషేకం చేపట్టారు.
పవన్ కళ్యాణ్, ఆయన భార్య అనా కొణిదెల తో కలిసి ఆలయ ప్రాంగణాన్ని తిలకించారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖా మంత్రి అరుణ్ కుమార్ సక్సేనా, పవన్ కళ్యాణ్ గారి వెంట ఉన్నారు.
పవన్ కల్యాణ్ అనా దంపతులకు ఆలయమర్యాదలతో స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు.
Discussion about this post