పవన్ కల్యాణ్ అభిమానికి శుక్రవారం రూ.50వేలు ఆర్థిక సాయం చేశారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం కోబాక గ్రామానికి చెందిన జనసేన క్రియాశీలక సభ్యుడు, పవన్ కల్యాణ్ అభిమాని వై.నితీష్ కుమార్ ఇటీవల ప్రమాదంలో గాయపడ్డాడు.
జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజక వర్గం ఇన్ ఛార్జి వినుత కోట ఈ విషయం పవన్ కల్యాణ్ కు తెలియ చేశారు. దీంతో పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రమాద బీమా కింద నితీష్ కుమార్ కు రూ.50వేలు పంపారు. జనసేన ఇన్ ఛార్జి వినుత కోబాక లోని నితీష్ కుమార్ ఇంటికి వెళ్లి స్వయంగా అందజేశారు.
ఈ సందర్భంగా వినుత మాట్లాడుతూ… జనసేన కార్యకర్తలను ఆదుకోవడానికి పవన్ ఎపుడూ ముందు ఉంటారని చెప్పారు.
మలి దశ క్రియాశీల సభ్యత్వం నమోదు ఈ నెల 21 నుంచి ప్రారంభం అవుతుందని… కార్యకర్తలందరూ తప్పకుండా సభ్యత్వం తీసుకోవాలని కోరారు.
.