రక్తదానం చేసి మనుషుల ప్రాణాలు కాపాడాలని కోరుతూ భగత్ సింగ్ డోనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కళాశాలలో విస్తృత ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా గేట్ విద్యాసంస్థల లో రక్తం ఇచ్చిన రక్త దాతలకు సర్టిఫికెట్లు పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా గేట్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రమేష్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర మాట్లాడుతూ నేడు రక్తం దొరకక అనేకమంది చనిపోతున్నారు మానవతా దృక్పథంతో ఆలోచించి ప్రతి ఒక్కరూ రక్తమిచ్చి మనుషుల ప్రాణాలను కాపాడడానికి ప్రయత్నించాలని విజ్ఞప్తి చేశారు.
చాలామందికి రక్తం దొరక అనేకమంది ఇబ్బందులకు గురవుతున్నారు.. కనీసం ప్రతి మనిషి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయడం ద్వారా మనుషులు ప్రాణాలను నిలబెట్టడానికి ఉపయోగపడుతుందన్నారు. నేటి సమాజంలో మనుషులు సమాజానికి ఉపయోగపడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం లో భగత్ సింగ్ బ్లడ్ డోనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సురేష్ కార్యదర్శి అజయ్ కుమార్ విద్యార్థులు విద్యార్థులు పాల్గొన్నారు.
.