పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని తెలుగుదేశం బీసీ విభాగం జిల్లా మాజీ అధ్యక్షులు నెమళ్లూరు బుజ్జి డిమాండు చేశారు.
రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం రాత్రి ఆయన శ్రీకాళహస్తి పట్టణవలోని 22వ వార్డు పరిధిలో కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా నెమళ్లూరు బుజ్జి మాట్లాడుతూ… శ్రీకాళహస్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి గారి ఆదేశాలతో పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ ప్రోత్సహంతో ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు.
ఇప్పుడున్న పరిస్థితిలో కరెంట్ చార్జీలు పెంచడం మూలిగే నక్క మీద తాటాకు పడ్డట్టు ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు మానుకుంటే మంచిదని.. లేకుంటే ప్రజలే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో లో 22 వ వార్డు అధ్యక్షులు పూల శేఖర్, కార్యదర్శి రమేష్ , శంకరయ్య, సుబ్రమణ్యం, బత్తయ్య రామచంద్ర, భాష మొదలైన వాళ్ళు పాల్గొన్నారు.
.