జిగేల్ రాణి గొంత సవరించుకుంటోంది. అందాలతో మత్తెక్కించే ఈ భామ.. తన స్వరంతో కూడా ప్రేక్షకులను సమ్మోహనపరిచేందుకు సిద్ధం అవుతోంది. అక్కినేని అఖిల్ సరసన చేస్తున్న చిత్రం కోసం డబ్బింగ్ కూడా చెబుతోంది.
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
బన్నీ వాసు, మరో నిర్మాత ప్రముఖ దర్శకుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో అఖిల్ అక్కినేని సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
తాజాగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ కోసం పూజా హెగ్డే డబ్బింగ్ చెబుతున్నారు పూజ హెగ్డే. తన సొంత గాత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు పూజా హెగ్డే. తెలుగులో అద్భుతమైన స్పష్టతతో డబ్బింగ్ చెబుతున్నారు.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ నుంచి ఇటీవలే విడుదలైన లెహరాయి పాటకు కూడా యూ ట్యూబ్ లో మంచి స్పందన వస్తోంది. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తన చిత్రాల్లోని పాత్రల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో లవ్ లీగా ఉండేలా డిజైన్ చేస్తారు. అందుకే ఆయన చిత్రాలకి ఓ ప్రత్యేకత వుంటుంది. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కూడా అఖిల్ అక్కినేని, పూజాల మధ్య కూడా అలాంటి కెమిస్ట్రి ఉండేలా డిజైన్ చేసారు.
అక్టోబర్ 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.
Discussion about this post