శ్రీకాళహస్తి నదీ తీరంలో ఉన్న శ్రీ శుక బ్రహ్మా ఆశ్రమంలో శనివారం శ్రీ రామకృష్ణ పరమహంస జయంతి వేడుకలు ఆశ్రమ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానంద నందగిరి స్వామి వారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామ కృష్ణ పరహంస బోధించిన ఏకత్వం, అనీ జీవుల్లో దైవతం, ఒక్కడే భగవంతుడు, మానవ సేవయే మాధవ సేవ లాంటి అనేక బోధనలు మనం ఆచరించాలి ఆన్నారు.
రామ కృష్ణ పరహంస చిత్ర పటానికి పూాకార్యక్రమాలు నిర్వహించారు. భజనలు కీర్తనలు ఆలపించారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ విద్యా స్వరూపానంద గిరి స్వాములవారు , పి.వి.ఆర్.గ్రూప్స్ డైరెక్టర్ జనార్థన్ రావు జే.పవార్, రత్నం రెడ్డి, భక్తవత్సల నాయుడు, జయచంద్ర నాయుడు, అజయ్ కుమార్, పెరుమాళ రెడ్డి మరియు భక్తులు పాలోగ్నారు.
.